టోక్యో పారాలింపిక్స్: ఆర్చరీలో భారత్‌కు కాంస్యం అందించిన హర్విందర్ సింగ్
ABN , First Publish Date - 2021-09-04T00:55:17+05:30 IST
పారాలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం సొంతమైంది. ఆర్చరీలో హర్విందర్ సింగ్ కాంస్య
టోక్యో: పారాలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం సొంతమైంది. ఆర్చరీలో హర్విందర్ సింగ్ కాంస్య పతకం గెలుచుకుని ఈ విభాగంలో భారత్‌కు తొలి పతకం అందించాడు. దక్షిణ కొరియా ఆటగాడు కిమ్ మిన్ సు తో జరిగిన కాంస్య పతక పోరులో విజయం సాధించిన హర్విందర్ పతకం సాధించాడు. ఫలితంగా టోక్యో పారాలింపిక్స్‌లో భారత్ సాధించిన పతకాల సంఖ్య 13కు పెరిగింది. భారత్‌కు ఈ రోజు ఇది మూడో పతకం కావడం గమనార్హం. ప్రవీణ్ కుమార్, అవని లేఖర అంతకుముందు పతకాలు గెలుచుకున్నారు. పతకాల పట్టిలో భారత్ 2 స్వర్ణాలు, 6 రజత పతకాలు, 5 కాంస్య పతకాలతో 37వ స్థానంలో ఉంది.
మరోవైపు, బ్యాడ్మింటన్ పురుషుల మిక్స్‌డ్ డబుల్స్‌లో భారత్ జోడీ ప్రమోద్ భగత్, పాలక్ కోహ్లీ జోడీ సెమీ ఫైనల్స్‌లోకి ప్రవేశించింది. సింగిల్స్ ప్లేయర్, నోయిడా జిల్లా మేజిస్ట్రేట్ సుహాస్ యతిరాజ్ బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ ఎస్ఎల్ 4 గ్రూప్ ఎ మ్యాచ్‌లో ఫ్రాన్స్ ఆటగాడు లుకాస్ మాజుర్ చేతిలో ఓటమి పాలయ్యారు. కాగా, ప్రమోద్ భగత్-పాలక్ కోహ్లీ జంట రేపు (శనివారం) జరగనున్న సెమీస్‌లో హారీ సుసంటో- లీని రాత్రితో తలపడతారు. పురుషుల సింగిల్స్‌లో సుహాస్, తరుణ్ ధిల్లాన్, మనో జ్ సర్కార్ సెమీస్‌లోకి దూసుకెళ్లారు.