ఆయనకింకా జైలు బుద్ధులు పోలేదు: అయ్యన్న

ABN , First Publish Date - 2020-05-28T19:21:36+05:30 IST

అసమర్థడు, దొంగ, జైల్లో ఉండి 16 నెలలు చిప్పకూడు తిన్నటువంటి..

ఆయనకింకా జైలు బుద్ధులు పోలేదు: అయ్యన్న

అమరావతి: అసమర్థడు, దొంగ, జైల్లో ఉండి 16 నెలలు చిప్పకూడు తిన్నటువంటి సీఎం జగన్ పరిపాలన ఏ విధంగా ఉంటుందో అందరికీ తెలిసిందేనని టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు అన్నారు. మహానాడు సందర్భంగా రెండో రోజు గురువారం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రికింకా జైలు బుద్ధులు పోలేదని అన్నారు. జగన్మోహన్ రెడ్డి ఏడాది పాలనలో అరాచకం, హింసా, విధ్వంసాలు చెలరేగిపోయాయని ఆరోపించారు. వేధింపులు, బెదిరింపులు, దాడులు, దౌర్జన్యాలు హద్దు అదుపులేకుండా పోయాయన్నారు.


ప్రాణాలకు రక్షణ కరువై ప్రజలు భయంతో బిక్కు బిక్కు మంటూ బతుకుతున్నారని అయ్యన్న అన్నారు. పారిశ్రామిక వేత్తలను బెదిరించి ఏపీ నుంచి తరిమేశారని, రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు. ఇవన్నీ ఏడాది పాలనలో చూస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా అవినీతి, దోపిడీలు జరుగుతున్నాయన్నారు. ప్రభుత్వ భూములు అమ్మకానికి పెడుతున్నారని, ప్రైవేటు భూములు కూడా బలవంతంగా లాక్కుంటున్నారని ఆరోపించారు. ఇంకా దారుణం ఏంటంటే.. తిరుమల  తిరుపతి శ్రీవారి భూములు కూడా అమ్ముకునే పరిస్థితికి ఈ ప్రభుత్వం వచ్చిందని అయ్యన్న పాత్రుడు మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలు ఒక్కసారి ఆలోచించాలన్నారు. ఆలయాల భూములపై స్వామీజీలు ఎందుకు మాట్లాడడం లేదని అయ్యన్న ప్రశ్నించారు.

Updated Date - 2020-05-28T19:21:36+05:30 IST