పిల్లలకి రక్షణ ఇలా...

ABN , First Publish Date - 2021-06-03T05:30:00+05:30 IST

చిటపట చినుకుల వర్షాకాలం పిల్లలకు ఆహ్లాదంగానే ఉంటుంది. కానీ వారు అనారోగ్యాలకు గురయ్యే కాలం కూడా ఇదే. అందుకే తల్లితండ్రులు ఈ సీజన్‌లో మరింత ఎక్కువ సంరక్షణ చర్యలు తీసుకోవాలి...

పిల్లలకి రక్షణ ఇలా...

చిటపట చినుకుల వర్షాకాలం పిల్లలకు ఆహ్లాదంగానే ఉంటుంది. కానీ వారు అనారోగ్యాలకు గురయ్యే కాలం కూడా ఇదే. అందుకే తల్లితండ్రులు ఈ సీజన్‌లో మరింత ఎక్కువ సంరక్షణ చర్యలు తీసుకోవాలి. 


కాచిన నీరే ఇవ్వండి: వర్షాకాలంలో ఎక్కువ వ్యాధులు నీటి కారణంగానే సంక్రమిస్తాయి. కలుషితమైన నీరు తాగితే డయేరియా లాంటి రోగాలను ఆహ్వానించినట్టే. పెద్దల కన్నా పిల్లల మీద ఈ ప్రభావం ఎక్కువ. కాబట్టి కాచి చల్లార్చిన లేదా సరైన పద్ధతిలో ఫిల్టర్‌ చేసిన నీరు మాత్రమే పిల్లలకు ఇవ్వాలి.

చేతులు శుభ్రంగా ఉండాలి: చాలామంది పిల్లలకు నోట్లో చేతులు పెట్టుకొనే అలవాటు ఉంటుంది. ఏదైనా తినేటప్పుడు చేతులు కడుక్కోవాలన్న ఆలోచన ఉండదు. ఈ పద్ధతిని మాన్పించాలి. ఇది కరోనా కాలం కాబట్టి చేతుల శుభ్రతను మరింత కచ్చితంగా పాటించాల్సిందే. 

ఇమ్యూనిటీ పెంచే ఆహారం: పండ్లు, పండ్ల రసాలు, ఇమ్యూనిటీ పెంచే పదార్థాలు పిల్లల ఆహారంలో తప్పనిసరి భాగంగా ఉండాలి. వీలైనంతవరకూ బయటి నుంచి తెచ్చిన ఆహారాన్నీ, చిరుతిళ్ళనూ పిల్లలకు పెట్టకండి. స్ట్రీట్‌ ఫుడ్‌ జోలికి వెళ్ళకపోవడం శ్రేయస్కరం.

ఇంటి శుభ్రతా ముఖ్యమే: ఇంటి వరండాల్లో, బాల్కనీల్లో, పెరళ్ళలో వర్షపు నీరు నిల్వ ఉండకుండా చూసుకోండి. దీనివల్ల దోమలనూ, వాటి వల్ల వచ్చే వ్యాధులనూ నివారించుకోవచ్చు.

వర్షంలో తడవనివ్వకండి: వానలో తడవాలని పిల్లలు సరదా పడుతూ ఉంటారు. కానీ ఇలాంటి సరదా తరచుగా అనారోగ్యాలకు దారితీస్తుంది. వర్షం పడుతున్నప్పుడు పిల్లలను బయటకు తీసుకువెళ్ళాల్సి వస్తే రెయిన్‌ కోట్‌తో శరీరం పూర్తిగా కప్పి ఉండేలా చూడండి. 


Updated Date - 2021-06-03T05:30:00+05:30 IST