హార్ట్‌రేట్‌ మెజరింగ్‌

ABN , First Publish Date - 2021-02-06T05:50:59+05:30 IST

గూగుల్‌ హెల్త్‌ ట్రాకింగ్‌ వేదికైన ‘గూగుల్‌ ఫిట్‌’లో కొత్త ఫీచర్‌ను ఏర్పాటు చేస్తోంది. దీని సహాయంతో మొబైల్‌ ఫోన్ల నుంచే గుండె,

హార్ట్‌రేట్‌ మెజరింగ్‌

గూగుల్‌ హెల్త్‌ ట్రాకింగ్‌ వేదికైన ‘గూగుల్‌ ఫిట్‌’లో  కొత్త ఫీచర్‌ను ఏర్పాటు చేస్తోంది. దీని సహాయంతో మొబైల్‌ ఫోన్ల నుంచే గుండె, శ్వాస వేగాన్ని తెలుసుకోవచ్చు. ఇందుకోసం ఫోన్‌ కెమెరాను ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ సౌలభ్యాన్ని మొదట పిక్సల్‌ ఫోన్‌లకు తదుపరి ఆండ్రాయిడ్‌ డివైజ్‌లకు గూగుల్‌ అందుబాటులోకి తేనుంది.

ఫ్రంట్‌ ఫేసింగ్‌ కెమెరా ఎదుట తల, ముఖ్యంగా కింది భాగం  కనిపించేలా చూసుకుంటే చాలు. శ్వాస రేటును తెలుసుకోవచ్చు. 


ముక్కు దాని చుట్టుపక్కల ప్రదేశం బాగా కనిపించేలా ప్రొజెక్టు చేసుకోగలిగితే సరిపోతుంది.  శ్వాసకు సంబంఽధించిన సమాచారాన్ని పసికడుతుంది. అలాగే గుండె వేగాన్ని తెలుసుకోవాలంటే ఫోన్‌వెనకభాగంలో ఉండే లెన్త్‌పై చేతివేలు పెడితే చాలా వివరాలు తెలుస్తాయి. 


శక్తిమంతమైన సెన్సర్లు, కంప్యూటర్‌ విజన్‌లో అడ్వాన్స్‌మెంట్స్‌తో ఇది సాధ్యమవుతోంది. చెస్ట్‌ మూవ్‌మెంట్స్‌ సహా శ్వాసరేటు, చేతి వేళ్ళలో చిన్నపాటి రంగు మార్పుతో గుండె కొట్టుకోవడాన్ని పసిగడుతుంది. అంతమాత్రాన దీన్నే వైద్య అవసరాలకు ప్రామాణికంగా భావించే వీలు లేదు. ప్రస్తుతానికి ఇది ప్రాథమిక హెల్త్‌ రిపోర్ట్‌గా పనిచేస్తుంది. 

Updated Date - 2021-02-06T05:50:59+05:30 IST