Abn logo
Aug 31 2021 @ 16:10PM

ప్రకాశం జిల్లాలో భారీగా గంజాయి పట్టివేత

ప్రకాశం: జిల్లాలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈతనిఖీల్లో భారీగా గంజాయి పట్టుబడింది.  జిల్లాలోని ఇంకొల్లు మండలం గంగవరం రోడ్డులో పోలీసులు వాహనాల తనిఖీలు చేస్తుండగా ఆటోలో ఆక్రమంగా తరలిస్తున్న 300 కేజీల గంజాయిని నిందితుల దగ్గరి నుంచి పట్టుకున్నారు. ఈ సరుకు విలువ 24 లక్షల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. గంజాయి తరలిస్తున్న ఇద్దరు నిందితుల నుంచి ఓ కారు, ఆటో, ఫోన్ స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్ట్ చేశారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారని పోలీసులు మీడియాకు తెలిపారు.