భారంగా ‘బంగారం’ రుణాలు

ABN , First Publish Date - 2021-06-02T10:11:19+05:30 IST

ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎ్‌సబీ)కు మరో చిక్కు వచ్చిపడింది. ఈ బ్యాంకులు ఇచ్చిన బంగారం రుణా ల్లో ఎక్కువ భాగం మొండి బకాయిలు (ఎన్‌పీఏ)గా మారే సూచనలు కనిపిస్తున్నాయి

భారంగా ‘బంగారం’ రుణాలు

బ్యాంకులకు మొండి బకాయిల భయం

వేలం బాటలో ఎన్‌బీఎ్‌ఫసీలు


ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎ్‌సబీ)కు మరో చిక్కు వచ్చిపడింది. ఈ బ్యాంకులు ఇచ్చిన బంగారం రుణా ల్లో ఎక్కువ భాగం మొండి బకాయిలు (ఎన్‌పీఏ)గా మారే సూచనలు కనిపిస్తున్నాయి. గత ఏడాది కొవిడ్‌ సమయంలో ప్రభుత్వ బ్యాంకులు.. బంగారం లేదా బంగారు నగల్ని హామీగా పెట్టుకుని రూ.2 లక్షల కోట్ల వరకు రుణాలను మంజూరు చేశాయి. ఆదాయాలు పడిపోవడంతో చాలా మంది అప్పట్లో పసిడి రుణాలనే ఆశ్రయించారు. దానికి తోడు గత ఏడాది పది గ్రాముల పుత్తడి ధర రూ. 56,000 వరకు ఉంది. అంతేకాకుండా భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌   (ఆర్‌బీఐ) మార్గదర్శకాలకు అనుగుణంగా బ్యాంకులు బంగారం విలువలో 90 శాతం వరకు రుణాలుగా మం జూరు చేశాయి. మరోవైపు నాన్‌ బ్యాం కింగ్‌ సంస్థ (ఎన్‌బీఎ్‌ఫసీ)లైన ముత్తూట్‌ ఫైనాన్స్‌, మణప్పురం ఫైనాన్స్‌ వంటి కంపెనీలు 3 నుంచి 9 నెలల కాలానికే బంగారం రుణాలను ఇవ్వగా.. పీఎ్‌సబీలు మాత్రం ఏడాది కాలానికి ఇచ్చాయి. 


ధర తగ్గుదలే కొంపముంచిదా.. 

గత ఏడాది ధరతో పోలిస్తే ప్రస్తుతం పసిడి ధర 10 శాతం తక్కువగా ఉంది. దీంతో గోల్డ్‌ లోన్స్‌ తీసుకున్న చాలా మంది ఆ రుణాలు చెల్లించేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. దీంతో వారు కుదువ పెట్టిన బంగారాన్ని వేలం వేసి బకాయిలు వసూలు చేసుకోవడం తప్ప బ్యాంకులకు మరో మార్గం కనిపించటం లేదు. అలా చేసినా వడ్డీతో పాటు అసలుకూ పది శాతం లోటు ఏర్పడుతుందని అంచనా. ఈ భారం ఎంత ఉంటుందనే విషయం ఈ ఏడాది సెప్టెంబరు నెలాఖరుకుగానీ తెలియదని బ్యాంకింగ్‌ వర్గాలు చెబుతున్నాయి. 


ముందే జాగ్రత్తపడిన ఎన్‌బీఎ్‌ఫసీలు

ముత్తూట్‌ ఫైనాన్స్‌, ముణప్పురం ఫైనాన్స్‌ వంటి ఎన్‌బీఎ్‌ఫసీలు ఈ విషయంలో ముందే జాగ్రత్త పడ్డాయి. ఈ కంపెనీలు మూడు నుంచి తొమ్మిది నెలల కాలానికి మాత్రమే బంగారం రుణాలను మంజూరు చేస్తాయి. తగ్గిన పసిడి ధరకు అనుగుణంగా ఎప్పటికప్పుడు హామీలు తీసుకున్నాయి. అందుకు ముందుకు రాని రుణ గ్రహీతల బంగారాన్ని వేలం వేసి తమ బకాయిలు రాబట్టుకుంటున్నాయి. మణప్పురం ఫైనాన్స్‌ కంపెనీ ఈ ఏడాది మార్చితో ముగిసిన త్రైమాసికంలో తాకట్టు పెట్టిన వెయ్యి కిలోల బంగారాన్ని వేలంలో విక్రయించి రూ.404 కోట్లు రాబట్టుకుంది. బంగారం రుణాలే ప్రధాన వ్యాపారంగా ఉన్న ఈ కంపెనీ చరిత్రలో ఒక త్రైమాసికంలో ఇంత పెద్ద మొత్తంలో బంగారాన్ని వేలం వేయడం ఇదే మొదటిసారి.  

Updated Date - 2021-06-02T10:11:19+05:30 IST