Advertisement
Advertisement
Abn logo
Advertisement

వేర్వేరు ప్రదేశాల్లో భారీగా గుట్కా స్వాధీనం

ప్రకాశం: రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాల్లో అక్రమంగా రవాణా చేస్తున్న నిషేధిత గుట్కా పాకెట్లను భారీ మొత్తంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రకాశం జిల్లాలోని మార్కాపురం నెహ్రు బజార్‌లోని ఓ హోటల్‌లో అక్రమంగా నిల్వ ఉంచిన మద్యం, గుట్కాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపు 10 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. 


కర్నూలు: జిల్లాలో భారీగా మద్యం, గుట్కాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటిని విక్రయిస్తున్న 10 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. 


నెల్లూరు: జిల్లాలోని రాపూరులో కిరాణ దుకాణాలపై పోలీసుల దాడులు చేశారు. వాటిలో అక్రమంగా నిలువ ఉంచిన గుట్కా పాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ దాదాపు రూ.11,200 ఉంటుందన్నారు. ఈ ఘటనలో ఒక వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. 


Advertisement
Advertisement