Advertisement
Advertisement
Abn logo
Advertisement
Nov 13 2021 @ 21:26PM

వేర్వేరు ప్రాంతాల్లో భారీగా గంజాయి పట్టివేత

సూర్యాపేట/భద్రాద్రి: రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం పోలుమల్ల దగ్గర ఆర్టీసీ బస్సులో అక్రమంగా తరలిస్తున్న 26 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఢిల్లీకి చెందిన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్‌ చేశారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 


భద్రాద్రి జిల్లాలో..

అలాగే భద్రాచలం బ్రిడ్జ్ చెక్‌పోస్ట్ దగ్గర వాహనాల తనిఖీలను పోలీసులు నిర్వహించారు. ఈ తనిఖీలలో 3 బైక్‌లలో అక్రమంగా తరలిస్తున్న 2 కేజీల గంజాయిని పట్టుకున్నారు. ఆరుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ఘటనలో బూర్గంపాడు మండలంలోని మోరంపల్లి బంజరు ఫారెస్ట్ చెక్‌పోస్ట్ దగ్గర పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అక్రమంగా తరలిస్తున్న రూ.16 లక్షల గంజాయిని పట్టుకున్నారు. దీనితో సంబంధమున్న నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితుల వద్ద నుంచి 2 బైక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement
Advertisement