Abn logo
Aug 21 2021 @ 02:43AM

అమెజాన్‌ అలెక్సా అమితాబ్‌ వాయిస్‌ ఇలా పొందొచ్చు

అమెజాన్‌ అలెక్సా తొలిసారిగా భారత్‌లో సెలిబ్రిటీ గొంతుతో వినిపించబోతోంది. బాలీవుడ్‌ లెజెండ్‌ అమితాబ్‌  బచ్చన్‌ వాయి్‌సను మన దేశంలో తన షాపింగ్‌ యాప్‌నకు జోడించింది. ఇకపై కస్టమర్లకు అమితాబ్‌ గొంతుతో అలెక్సా సమాధానం ఇవ్వనుంది. ఇది పూర్తిగా పెయిడ్‌ ఫీచర్‌. ఎకో చందాదారులు దీన్ని పొందాలంటే ఏటా వార్షిక రేటు రూ.149. 


‘అలెక్సా మాకు అమితాబ్‌ను పరిచయం చేయి’ అని మొదట యూజర్లు అడగాలి.  ఆ తరవాతే అమిత్‌ జీ అంటూ ఇంటారాక్షన్‌కు అవకాశం కలుగుతుంది. ఎకో డివై్‌సలో మిక్‌ ఐకాన్‌ను ప్రెస్‌ చేయడం ద్వారా ఈ సౌలభ్యాన్ని వినియోగదారులు పొందవచ్చు. 


అమితాబ్‌ జీవితానికి సంబంధించిన కథలు, ఆయన తండ్రి రాసిన కవితలు, టంగ్‌ ట్విస్టర్లు, మోటివేషనల్‌ కోట్స్‌ వంటివన్నీ లభ్యమవుతాయి. అమితాబ్‌ స్టయిల్‌లో అలారమ్‌, వాతావరణ నివేదికలు, మ్యూజిక్‌ కూడా పొందవచ్చు. కళాత్మకతతో జతపడిన ఈ క్రియేటివిటీకి అబ్బురపడిన అమితాబ్‌, ఇలా ఒక కొత్త మీడియమ్‌ ద్వారా అభిమానులకు దగ్గర అవుతుండటంపై ఆనందం వ్యక్తం చేస్తుండటం విశేషం.  అమితాబ్‌తో ఒప్పందం కుదుర్చుకోవడం ఇదే మొదటి సారి కాదు. అమెరికాలోని శామ్యూల్‌ ఎల్‌ జాక్సన్‌తో కలిసి గత ఏడాది డిసెంబర్‌లోనే అమితాబ్‌ను అమెజాన్‌ పరిచయం చేసింది.