జగన్‌ దళిత వ్యతిరేక విధానాలు విడనాడాలి: జడ శ్రావణ్‌

ABN , First Publish Date - 2021-08-02T08:04:15+05:30 IST

ముఖ్యమంత్రి జగన్‌ దళిత వ్యతిరేక విధానాలు విడనాడాలని, లేదంటే రాబోయే కాలంలో దళితులు తమ ఓటు హక్కుతో తగిన బుద్ధి చెబుతారని జైభీమ్‌ యాక్సెస్‌ జస్టిస్‌ వ్యవస్థాపక

జగన్‌ దళిత వ్యతిరేక విధానాలు విడనాడాలి: జడ శ్రావణ్‌

విజయవాడ సిటీ, ఆగస్టు 1: ముఖ్యమంత్రి జగన్‌ దళిత వ్యతిరేక విధానాలు విడనాడాలని, లేదంటే రాబోయే కాలంలో దళితులు తమ ఓటు హక్కుతో తగిన బుద్ధి చెబుతారని జైభీమ్‌ యాక్సెస్‌ జస్టిస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు, హైకోర్టు న్యాయవాది జడ శ్రావణ్‌కుమార్‌ హెచ్చరించారు. మాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో విజయవాడ ధర్నాచౌక్‌లో ‘దళిత హక్కుల పరిరక్షణ దీక్ష’ ఆదివారం జరిగింది. ఈ దీక్షలో పాల్గొని సంఘీభావం తెలిపిన ఆయన మాట్లాడుతూ,  బడుగు, బలహీన వర్గాలు రాజ్యాధికారం సాధించే రోజు దగ్గరలోనే ఉందని, అందుకు అందరూ కృషి చేయాలని కోరారు.మాల ఐక్య వేదిక జాతీయ అధ్యక్షుడు తిర్రే రవిదేవా మాట్లాడుతూ... దళితులపై దాడులు, వేధింపుల నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. 

Updated Date - 2021-08-02T08:04:15+05:30 IST