ఉపాధి హామీ పనులపై హైకోర్టులో విచారణ

ABN , First Publish Date - 2021-08-18T02:40:41+05:30 IST

ఉపాధి హామీ పనులపై హైకోర్టులో విచారణ

ఉపాధి హామీ పనులపై హైకోర్టులో విచారణ

అమరావతి: ఉపాధి హామీ పనులపై కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ఏపీలో పనులకు సంబంధించిన బిల్లులు చెల్లించామని కేంద్ర పేర్కొంది. కేంద్ర ప్రభుత్వ నిధులే రూ.1,991 కోట్లు రాష్ట్రం వద్ద ఉన్నాయని కేంద్రం తరపు న్యాయవాది తెలిపారు. అఫిడవిట్‌ను పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు నిలదీసింది. కేంద్రం నిధులు ఇస్తుంటే కాంట్రాక్టర్లకు బిల్లులు ఎందుకు ఇవ్వటం లేదని ప్రశ్నించింది. ఈ నిధులను వేరే పథకాలకు ఏమైనా మళ్లిస్తున్నారా అంటూ ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించింది. ఇప్పటివరకు కాంట్రాక్టర్లకు ఎన్ని నిధులు చెల్లించారు, ఎంత పెండింగ్‌లో ఉన్నాయని ప్రశ్నించింది. విజిలెన్స్ విచారణలో పురోగతి ఏంటో అఫిడవిట్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశించింది. విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. 

Updated Date - 2021-08-18T02:40:41+05:30 IST