ఉద్యోగులకు హోండా వీఆర్ఎస్ ఆఫర్... వారికి 5 లక్షలు అ‘ధనం’...

ABN , First Publish Date - 2021-01-07T02:28:29+05:30 IST

భారత మార్కెట్ లో... రెండో అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా(హెచ్‌ఎంఎస్‌ఐ) తమ సంస్థ ఉద్యోగులకు వాలంటరీ రిటైర్మెంట్ స్కీం(వీఆర్‌ఎస్)ను ప్రకటించింది. మందగమనం, కరోనా కారణంగా 2019, 2020 ల్లో వాహన పరిశ్రమపై తీవ్ర ప్రభావం పడిన విషయం తెలిసిందే.

ఉద్యోగులకు హోండా వీఆర్ఎస్ ఆఫర్... వారికి 5 లక్షలు అ‘ధనం’...

గురుగాం : భారత మార్కెట్ లో... రెండో అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా(హెచ్‌ఎంఎస్‌ఐ) తమ సంస్థ ఉద్యోగులకు వాలంటరీ రిటైర్మెంట్ స్కీం(వీఆర్‌ఎస్)ను ప్రకటించింది. మందగమనం, కరోనా కారణంగా 2019,  2020 ల్లో  వాహన పరిశ్రమపై తీవ్ర ప్రభావం పడిన విషయం తెలిసిందే. 


ఈ క్రమంలో... ఉద్యోగులకు వీఆర్ఎస్(స్వచ్ఛంద పదవీవిరమణ పథకం)  తీసుకు వచ్చింది హోండా సంస్థ.  ఉత్పత్తి వ్యూహం రూపొందించేందుకు, అలాగే, ప్రస్తుత అనిశ్చిత పరిస్థితుల్లో సామర్థ్యాన్ని మెరుగుపరచేందుకు ఈ వీఆర్ఎస్ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు హోండా పేర్కొంది. నలభై ఏళ్ల వయస్సుకు పైబడిన, కంపెనీలో పదేళ్లకు పైగా పని చేస్తోన్న ఉద్యోగులు ఈ వీఆర్ఎస్ కు అర్హులని తెలుస్తోంది. కాగా... భారత్‌లో కోవిడ్ కారణంగా డిమాండ్ తగ్గడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ పేర్కొంది. భారత్‌లో ఉనికిని కాపాడుకునేందుకు ఇది తప్పలేదని ఉద్యోగులకు రాసిన లేఖలో పేర్కొన్నట్లుగా వినవస్తోంది. వాహన పరిశ్రమ గడ్డుకాలం ఎదుర్కొంటోందని, డిమాండ్ తగ్గడం, ఆర్థిక మందగమనం, కరోనా... తీవ్ర ప్రభావాన్ని చూపాయని, ఈ అస్థిర పరిస్థితుల్లో కార్యకలాపాల సామర్థ్యం పెంచుకునేలా ఉత్పత్తి వ్యూహాన్ని నిర్ణయించుకున్నట్లు హెచ్‌ఎంఎస్‌ఐ పేర్కొంది. 


ఆ 400 మందికి రూ. 5 లక్షలు అదనం...  ఈ(జనవరి) నెల 31 వ తేదీ నాటికి 40 ఏళ్లు పైబడిన వారు లేదా హోండాలో పదేళ్ల అనుభవం కలిగిన వారు ఈ వీఆర్ఎస్ స్కీంను ఉపయోగించుకోవచ్చు. భారత్‌లోని నాలుగు ప్లాంట్లలో కిందటి సంవత్సరం మార్చి 31 వ తేదీ నాటికి 7 వేల మంది ఉద్యోగులున్నారు. కాగా... ఈ వీఆర్ఎస్ ప్యాకేజీని అంగీకరించిన మొదటి 400 మందికి అదనంగా రూ. 5 లక్షలనందించనున్నట్లు కంపెనీ వెల్లడించింది. కాగా... వీఆర్ఎస్  ప్యాకేజీ కింద మూడు నెలల గ్రాస్ శాలరీ, ఒక నెల బేసిక్ పే, అలాగే... మిగిలిన నెలలకు వేరియబుల్ డియర్‌నెస్ అలవెన్స్ ఇస్తారు. 


సీనియర్ మేనేజర్, వైస్ ప్రెసిడెంట్, పర్మినెట్ వర్క్‌మెన్ గరిష్టంగా రూ. 72 లక్షలు, మేనేజర్ రూ. 67 లక్షలు, డిప్యూటీ మేనేజర్ రూ. 48 లక్షలు, అసిస్టెంట్ మేనేజర్ రూ. 36 లక్షలు, సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు రూ. 3 లక్షలు, ఎగ్జిక్యూటివ్‌లు రూ. 27 లక్షలు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్‌లు రూ. 15 లక్షల వరకు ఈ స్కీం కింద అందుకుంటారు.


Updated Date - 2021-01-07T02:28:29+05:30 IST