వరంగల్‌ కమిషనర్‌ను అభినందించిన హోంమంత్రి

ABN , First Publish Date - 2020-05-26T01:47:03+05:30 IST

సంచలనం సృష్టించిన వరంగల్‌ జిల్లా గొర్రెకుంట సంఘటన పై కొన్ని గంటల్లోనే కేసు చేధించిన వరంగల్‌ పోలీస్‌ సిబ్బందిని, కమిషనర్‌ రవీందర్‌ను రాష్ట్ర హోంమంత్రి మహమూద్‌అలీ అభినందించారు.

వరంగల్‌ కమిషనర్‌ను అభినందించిన హోంమంత్రి

హైదరాబాద్‌: సంచలనం సృష్టించిన వరంగల్‌ జిల్లా  గొర్రెకుంట సంఘటన పై కొన్ని గంటల్లోనే  కేసు చేధించిన వరంగల్‌ పోలీస్‌ సిబ్బందిని, కమిషనర్‌ రవీందర్‌ను రాష్ట్ర హోంమంత్రి మహమూద్‌అలీ అభినందించారు. వరంగల్‌ జిల్లాలోని గొర్రె కుంట గ్రామ పరిధిలోని బావిలో రెండు రోజుల వ్యవధిలోనే తొమ్మిది మృతదేహాలు వెలుగులోకి రావడం విధితమే. అంతు చిక్కని శవాల విషయంలో పకడ్బందీగా దర్యాప్తు జరపాలని  హోంమంత్రి వరంగల్‌కమిషనర్‌ రవీందన్‌ను ఆదేశించారు. మిస్టరీని చేధించేందుకు వరంగల్‌ పోలీసులు తీవ్రంగా కృషి చేసి నిందితుడిని పట్టుకోవడంతో కమిషనర్‌ను, దర్యాప్తులో పాల్గొన్న సిబ్బందిని హోంమంత్రి ప్రశంసించారు. అదే విధంగా గతంలో తొమ్మిది నెలల పాప హత్య ఘటనలోనూ 48 రోజులలో ఛార్జీషీటువేసి నిందితుడికి శిక్షపడేలా చేసిన వరంగల్‌ పోలీసుల కృషిని కూడా ఈసందర్భంగా హోంమంత్రి గుర్తుచేశారు. 

Updated Date - 2020-05-26T01:47:03+05:30 IST