Advertisement
Advertisement
Abn logo
Advertisement
Aug 17 2021 @ 19:30PM

‘గాంధీ’ ఘటనపై హోంమంత్రి సమీక్ష

హైదరాబాద్: గాంధీ ఆస్పత్రిలో మహిళలు అత్యాచారానికి గురైన ఘటనపై హోంమంత్రి మహమూద్ అలీ మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీ ఆస్పత్రిలో జరిగిన ఘటనపై ఆరాతీశారు. అనంతరం హోంమంత్రి మాట్లాడుతూ అత్యాచార ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలని అధికారులను ఆదేశించారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని, బాధితులకు న్యాయం చేయాలని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశానికి మంత్రి శ్రీనివాస్ గౌడ్, హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్, శిఖా గోయల్ తదితరులు హాజరయ్యారు. 

Advertisement
Advertisement