డిస్క్‌ సమస్యలకు హోమియో ఉత్తమం!

ABN , First Publish Date - 2021-08-03T05:30:00+05:30 IST

డిస్క్‌ సమస్యలతో తలెత్తే వెన్ను నొప్పిని పెయిన్‌ కిల్లర్స్‌తో తగ్గించుకోవడం సరి కాదు. డిస్క్‌ సమస్యలను

డిస్క్‌ సమస్యలకు హోమియో ఉత్తమం!

డిస్క్‌ సమస్యలతో తలెత్తే వెన్ను నొప్పిని పెయిన్‌ కిల్లర్స్‌తో తగ్గించుకోవడం సరి కాదు. డిస్క్‌ సమస్యలను నిర్లక్ష్యం చేస్తే అవి ఇతర సమస్యలకు దారి తీస్తాయి. హోమియో చికిత్స ద్వారా డిస్క్‌ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది అంటున్నారు హోమియో వైద్య నిపుణులు డాక్టర్‌ మధు వారణాశి.


వెన్నుపాములో ఉన్న ఎముకలు తేలికగా కదలడానికి షాక్‌ అబ్జార్బర్స్‌లా పనిచేసే డిస్క్‌ల్లో రెండు రకాల సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. ఒకటి డిస్క్‌ ప్రొలాప్స్‌, రెండవది డిస్క్‌ డిజనరేటివ్‌ డిస్క్‌ డిసీజ్‌. డిస్క్‌ బయట ఉన్న పొర బలహీనపడడం వల్ల డిస్క్‌ వెనక్కి జరిగి, కాళ్లలోకి వెళ్లే నరాలపై ఒత్తిడి పెరుగుతుంది. ఏ ప్రాంతంలోని నరాలపై ఒత్తిడి పెరిగితే ఆ ప్రాంతంలో తిమ్మిర్లు, మొద్దుబారడం, మంట లాంటివి మొదలవుతాయి. దీన్నే స్లిప్‌ డిస్క్‌ అంటారు. ఒక్కోసారి యాస్కులస్‌ అనే పొర చిట్లి, జెల్లీ లాంటి డిస్క్‌ మెటీరియల్‌ బయటకు వస్తుంది. దీన్నే డిస్క్‌ ప్రొలాప్స్‌ అంటారు. దీనివల్ల కాళ్లలో నొప్పి, నడుము నొప్పి ఉంటుంది. కాలును వంచకుండా తిన్నగా ఉంచి, పైకి ఎత్తినప్పుడు కాల్లో నొప్పి పెరిగితే డిస్క్‌ ప్రొలాప్స్‌గా భావించవచ్చు. 


సర్వైకల్‌ స్పాండిలోసిస్‌

మెడ దగ్గరి వెన్నుపూసలైన వెర్టిబ్రాల మధ్య ఉండే డిస్క్‌ అరిగి, అక్కడి నాడులు ఒత్తిడికి గురైతే మెడనొప్పి వస్తుంది. సర్వైకల్‌ స్పాండిలోసిస్‌, సర్వైకల్‌ డిస్క్‌ ప్రొలాప్స్‌, సర్వైకల్‌ ఫ్రాక్చర్స్‌, టిబి వల్ల ఎముకల్లో మార్పులు, సరైన భంగిమల్లో కూర్చోకపోవడం, ఎక్కువ బరువులు ఎత్తడం లాంటి కారణాల వల్ల ఈ సమస్య వచ్చే వీలుంది. తలనొప్పి, మెడనొప్పి, మెడ బిగుసుకుపోవడం, చేతులు, కాళ్లలో తిమ్మిర్లు, స్పర్శ తగ్గడం, మల, మూత్ర విసర్జనపై నియంత్రణ తగ్గడం, మెడ కండరాలు బలహీనపడడం లాంటి లక్షణాలు ఉంటాయి.


కారణాలు

అధిక బరువు, జీవనశైలి మార్పులు, పెరిగే వయసుతో వచ్చే మార్పులు, శక్తికి మించి బరువులు ఎత్తడం, రోజంతా వంగి పనులు చేయడం, వెన్నెముకకు దెబ్బలు తగలడం, గోతుల్లో ప్రయాణాల కారణంగా డిస్క్‌లపై ఒత్తిడి పెరగడం ప్రధాన కారణాలు.



సయాటికా

నడుములోని డిస్క్‌లపై ఒత్తిడి మూలంగా తలెత్తే సమస్య ఇది. నడుము నొప్పి, నొప్పి కాళ్ల వేళ్ల వరకూ పాకడం, తిమ్మిర్లు, అరికాళ్ల మంటలు ప్రధాన లక్షణాలు. కొందరిలో లైంగిక శక్తి తగ్గుతుంది. మల, మూత్ర విసర్జనపై నియంత్రణ పోతుంది.


వ్యాధి నిర్థారణ

సిటిస్కాన్‌, ఎక్స్‌రే, ఎమ్మారై స్కాన్‌, సి.బి.పి, సి.ఎస్‌.ఎఫ్‌ పరీక్షలతో సమస్యను నిర్థారించవచ్చు.


హోమియో చికిత్స

హోమియోలో శస్త్రచికిత్స అవసరం లేకుండా నయం చేసే వీలుంది. ఎంతవరకూ అనేది నిపుణులైన వైద్యుల మీద ఆధారపడి ఉంటుంది. సర్జరీతో సమస్యకు ఆటంకం కలిగించే వాటిని నిర్మూలించే ఆస్కారం ఉంటుంది కానీ, వ్యాఽధికారకాల నిర్మూలన, నివారణకు వీలు కాదు. కాబట్టి అనుభవజ్ఞులైన హోమియో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటే డిస్క్‌ సమస్యల నుంచి బయటపడవచ్చు.


 డా. మధు వారణాశి

MD, MS(PSYCHO), MCSEP

 ప్రముఖ హోమియో వైద్యులు

ప్లాట్‌నెం 188, వివేకానందనగర్‌ కాలనీ

కూకట్‌పల్లి, హైదరాబాద్‌

ఫోన్‌ : 8897331110, 8886509509


Updated Date - 2021-08-03T05:30:00+05:30 IST