Abn logo
Jul 31 2020 @ 21:02PM

భారత్‌లో మరో రెండు స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేసిన ఆనర్

న్యూఢిల్లీ: ఆనర్ నుంచి మరో రెండు స్మార్ట్‌ఫోన్లు వచ్చేశాయి. ఆనర్ 9ఎ, ఆనర్ 9ఎస్ పేరుతో భారత్‌లో విడుదల చేసిన ఈ ఫోన్లలో గూగుల్ ప్లేకు బదులు హువావే యాప్ గ్యాలరీ ఉండడం గమనార్హం. 9ఎలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉండగా, 9ఎస్‌లో సింగిల్ కెమెరా మాత్రమే ఉంది. 9ఎ 64 జీబీ వేరియంట్ ధర రూ. 9,999 కాగా, 9ఎస్ 32జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ. 6,499 మాత్రమే. అమెజాన్ ద్వారా ఈ రెండు ఫోన్లను కొనుగోలు చేసుకోవచ్చు. 9ఎ ఆగస్టు 6న 11 గంటల నుంచి అందుబాటులోకి రానుండగా, 9ఎస్ అదే రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి సేల్‌కు రానుంది.  


ఆనర్ 9ఎ స్పెసిఫికేషన్లు: డ్యూయల్ సిమ్, ఆండ్రాయిడ్ 10 ఓఎస్, 6.3 అంగుళాల ఫుల్‌వ్యూ డిస్‌ప్లే, ఆక్టాకోర్ మీడియా టెక్ ఎంటీ6762ఆర్ ప్రాసెసర్, 3జీబీ ర్యామ్, 13 ఎంపీ ప్రధాన సెన్సార్‌తో వెనకవైపు మూడు కెమెరాలు, ముందువైపు 8 ఎంపీ కెమెరా ఉంది. ఆన్‌బోర్డ్ మెమొరీ 64 జీబీ కాగా, 512 జీబీ వరకు పెంచుకునే వెసులుబాటు ఉంది. వెనకవైపు ఫింగర్‌ప్రింట్ సెన్సార్, రివర్స్ చార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ. 


ఆనర్ 9ఎస్ స్పెసిఫికేషన్లు: డ్యూయల్ సిమ్, ఆండ్రాయిడ్ 10 ఓఎస్, 5.45 అంగుళాల హెచ్‌డీ ప్లస్ ఫుల్ వ్యూ డిస్‌ప్లే, మీడియా టెక్ ఎంటీ6762ఆర్ ప్రాసెసర్, 2జీబీ ర్యామ్, వెనకవైపు 8ఎంపీ సింగిల్ కెమెరా, 5 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. 

Advertisement
Advertisement
Advertisement