Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఇంకెందరు రైతులు చావాలి ?: షర్మిల

హైదరాబాద్‌, డిసెంబరు 3(ఆంధ్రజ్యోతి): ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి సీఎం కేసీఆర్‌ ఆడుతున్న డ్రామాలకు మరో ఇద్దరు రైతులు చనిపోయారని, ఇంకెంత మంది చస్తే ఆయన కళ్లు చల్లబడతాయని వైఎస్సార్‌టీపీ అధినేత్రి షర్మిల ప్రశ్నించారు. రైతులు కార్లలో తిరుగుతున్నారని, వారిని కోటీశ్వరులను చేశామని చెప్పుకోవడానికి సిగ్గుండాలని వ్యాఖ్యానించారు. ఫామ్‌హౌస్‌ మత్తు నుంచి కేసీఆర్‌ బయటికి వస్తే వాస్తవ పరిస్థితి తెలుస్తుందని పేర్కొన్నారు. ఆత్మహత్యలు లేని తెలంగాణ ఏర్పడినప్పుడే అమరవీరుడు శ్రీకాంతాచారికి నిజమైన నివాళి అని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు శుక్రవారం ఆమె ట్వీట్లు చేశారు. 

Advertisement
Advertisement