రెండూ కనెక్ట్ అయ్యేదెలా? -టెక్ సందేహాలు
ABN , First Publish Date - 2020-06-27T05:30:00+05:30 IST
ఐఫోన్‌లో అంతర్గతంగా బ్లూటూత్ టెక్నాలజీ ఉన్నప్పటికీ వైర్‌లెస్ ఫైల్ ట్రాన్స్‌ఫర్ అనేది ఐఫోన్లు, ఐపాడ్‌ల వంటి ఐఓఎస్ డివైజ్‌ల మధ్య మాత్రమే సక్రమంగా జరుగుతుంది. ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి ఐపాడ్‌కి ఫైళ్లు ట్రాన్స్‌ఫర్ చేయడం నేరుగా...
ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి ఐపాడ్‌కి బ్లూటూత్ ద్వారా ఫోటోలు పంపిద్దామనుకుంటే కనెక్ట్ కావడం లేదు. పెయిరింగ్ కోడ్ ఇచ్చినా నాట్ కనెక్టెడ్ అని వస్తోంది. పరిష్కారం తెలుపగలరు.
- కె.యస్. నాయుడు, వైజాగ్
ఐఫోన్‌లో అంతర్గతంగా బ్లూటూత్ టెక్నాలజీ ఉన్నప్పటికీ వైర్‌లెస్ ఫైల్ ట్రాన్స్‌ఫర్ అనేది ఐఫోన్లు, ఐపాడ్‌ల వంటి ఐఓఎస్ డివైజ్‌ల మధ్య మాత్రమే సక్రమంగా జరుగుతుంది. ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి ఐపాడ్‌కి ఫైళ్లు ట్రాన్స్‌ఫర్ చేయడం నేరుగా సాధ్యపడదు. బ్లూటూత్ ఆధారంగా ఫైల్ ట్రాన్స్‌ఫర్ చేసే బంప్ వంటి థర్డ్ పార్టీ యాప్ ఆండ్రాయిడ్‌లో, ఐపాడ్‌లో తప్పనిసరిగా ఇన్‌స్టాల్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే ఈ రెండింటి మధ్య సంబంధిత అప్లికేషన్ ద్వారా ఫైల్ ట్రాన్స్‌ఫర్ అవుతుంది.