మేకప్‌ రంగులతో భారీ చిత్రం!

ABN , First Publish Date - 2021-02-23T09:07:17+05:30 IST

మేకప్‌ కోసం వినియోగించే రంగులతో 790 చదరపు అడుగుల భారీ చిత్రాన్ని.. అది కూడా 100 గంటల్లోనే పూర్తిచేస్తే.. గిన్నిస్‌ రికార్డే! ఆ రికార్డు కొల్లగొట్టి తన కల సాకారం చేసుకునేందుకు నెల్లూరు జిల్లాకు చెందిన చిత్రకారుడు షేక్‌ అమీర్‌ జాన్‌

మేకప్‌ రంగులతో భారీ చిత్రం!

నెల్లూరు: మేకప్‌ కోసం వినియోగించే రంగులతో 790 చదరపు అడుగుల భారీ చిత్రాన్ని.. అది కూడా 100 గంటల్లోనే పూర్తిచేస్తే.. గిన్నిస్‌ రికార్డే! ఆ రికార్డు కొల్లగొట్టి తన కల సాకారం చేసుకునేందుకు నెల్లూరు జిల్లాకు చెందిన చిత్రకారుడు షేక్‌ అమీర్‌ జాన్‌ ప్రయత్నిస్తున్నారు. మైక్రో, ఇతర పెయింటింగ్‌లతో ఇప్పటికే 46 ప్రపంచ రికార్డులు నెలకొల్పిన అమీర్‌.. తాజాగా మేకప్‌ రంగులతో అతిపెద్ద చిత్రాన్ని గీసేందుకు సిద్ధమయ్యారు. నెల్లూరులోని మాగుంట లే అవుట్‌లోని రెయిన్‌బో స్కూలులో ప్రముఖులు, సాటి కళాకారుల ఆశీస్సులతో సోమవారం ఈ చిత్రాన్ని ప్రారంభించారు. సోమవారం నుంచి ఈ నెల 28వ తేదీ వరకు 100 గంటల లక్ష్యంగా 73.4 చదరపు మీటర్ల (790 చదరపు అడుగులు) వైశాల్యం కలిగిన చిత్రాన్ని పూర్తి చేయనున్నారు. ఈ చిత్రం ద్వారా ‘చెట్లు నాటి పర్యావరణాన్ని కాపాడాలి’ అనే సందేశం కూడా ఇస్తున్నారు.

Updated Date - 2021-02-23T09:07:17+05:30 IST