రికార్డు స్థాయిలో Kuwait కు గుడ్ బై చెప్పిన వలసదారులు.. ఏడాదిన్నరలో..
ABN , First Publish Date - 2021-09-16T20:12:30+05:30 IST
మహమ్మారి కరోనా కారణంగా వలసదారుల విషయంలో గల్ఫ్ దేశం కువైత్‌లో ఇంతకుముందెన్నడూ చూడని కీలక పరిణామం చోటు చేసుకుంది. 2020 ప్రారంభంలో వైరస్ ప్రభావం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఏకంగా 1.90లక్షల మంది ప్రవాసులు ఆ దేశాన్ని వదిలి వెళ్లిపోయినట్లు తాజాగా వెలువడిన గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఏడాది మొదటి ఆరు..
కువైత్ సిటీ: మహమ్మారి కరోనా కారణంగా వలసదారుల విషయంలో గల్ఫ్ దేశం కువైత్‌లో ఇంతకుముందెన్నడూ చూడని కీలక పరిణామం చోటు చేసుకుంది. 2020 ప్రారంభంలో వైరస్ ప్రభావం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఏకంగా 1.90లక్షల మంది ప్రవాసులు ఆ దేశాన్ని వదిలి వెళ్లిపోయినట్లు తాజాగా వెలువడిన గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లోనే 56వేల మంది ప్రవాసులు కువైత్ నుంచి వెళ్లిపోయారు. దీంతో గత 30 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా 2020లో కువైత్ జనాభా ఆల్-టైమ్ కనిష్టానికి చేరుకుంది. 2021 తొలి ఆరు నెలల్లో ఆ దేశ జనాభా 0.9 శాతం మేర తగ్గడంతో ప్రస్తుతం మొత్తం జనాభా 4.6 మిలియన్లకు చేరుకున్నట్లు కువైత్ జాతీయ బ్యాంకు నివేదిక వెల్లడించింది.
కువైత్‌లో ప్రవాసుల సంఖ్య నిరంతరం తగ్గడం వల్ల జనాభా క్షీణత ఏర్పడిందని నివేదిక పేర్కొంది. ఆ దేశంలో కొనసాగుతున్న ఉద్యోగాల కువైటైజేషన్, మహమ్మారి కారణంగా బలహీనమైన ఆర్థిక వాతావరణం కార్పొరేట్ తొలగింపులకు కారణమైంది. ఈ విషయం వేలాది మంది విదేశీ కుటుంబాలను కువైత్ విడిచి వెళ్ళేలా చేసింది. కువైత్‌లో విదేశీయుల నియామకాలు ఈ సంవత్సరం మొదటి అర్ధభాగంలో 2.2 శాతం తగ్గాయి. అదే 2020లో మొత్తం 5.2 శాతం క్షీణత నమోదైంది. దీంట్లో ప్రభుత్వ రంగంలో 2.2 శాతం, ప్రైవేట్ రంగంలో 2.8 శాతంగా ఉన్నట్లు నివేదిక వెల్లడించింది.
ఇవి కూడా చదవండి..
ఆ వలసదారులు Kuwait కు ప్రమాదమే.. దేశం నుంచి బహిష్కరించండి.. ఓ MP డిమాండ్
America లో దారుణం.. శవాలుగా కనిపించిన భారతీయ విద్యార్థులు.. కారులో వెళ్తుండగా..
దేశంలోని ఉపాధి క్షీణత కారణంగా 2021 ప్రథమార్ధంలో గృహ కార్మికులు తప్పిస్తే కువైత్‌కు వచ్చే వలస కార్మికుల సంఖ్య 2.7 శాతం తగ్గింది. నిర్మాణ రంగంలో 9.8 శాతం క్షీణతతో పోలిస్తే 2021 ప్రథమార్ధంలో కువైత్‌లో ప్రవాసులు తమ ఉద్యోగాలను 1.1 శాతం మేర తగ్గించారు. విమానాల పున:ప్రారంభంతో కొంత మంది ప్రవాసులు తిరిగి వచ్చే అవకాశం ఉన్నప్పటికీ, కోవిడ్-19 ఆర్థిక పరిణామాలు, ఉద్యోగాల కువైటైజేషన్ ఫలితంగా కువైత్ నుండి వలస కార్మికుల వలసలు కొనసాగుతాయని నివేదిక అంచనా వేసింది. ఇక ఆగస్టు 1 నుంచి రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వలసదారులకు తిరిగి వచ్చేందకు కువైత్ అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో విదేశీయుల ఎంట్రీపై దాదాపు 7 నెలల పాటు కొనసాగిన బ్యాన్‌కు తెరపడింది.