హెచ్‌పీసీఎల్‌కు భారీ రియాక్టర్‌

ABN , First Publish Date - 2021-05-19T09:56:52+05:30 IST

హిందూస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌(హెచ్‌పీసీఎల్‌)కు గుజరాత్‌ నుంచి సోమవారం అర్ధరాత్రి ఓ భారీ రియాక్టర్‌ వచ్చింది.

హెచ్‌పీసీఎల్‌కు భారీ రియాక్టర్‌

మల్కాపురం (విశాఖపట్నం), మే 18: హిందూస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌(హెచ్‌పీసీఎల్‌)కు గుజరాత్‌ నుంచి సోమవారం అర్ధరాత్రి ఓ భారీ రియాక్టర్‌ వచ్చింది. హెచ్‌పీసీఎల్‌ విస్తరణ పనుల్లో భాగంగా గుజరాత్‌లో ఎల్‌ అండ్‌ టీ సంస్థ తయారు చేసిన ఈ రియాక్టర్‌ను సముద్ర మార్గం ద్వారా విశాఖలోని షిప్‌యార్డుకు తీసుకొచ్చారు. అక్కడి నుంచి ఈ భారీ రియాక్టర్‌ను హైడ్రాలిక్‌ వాహనం ద్వారా హెచ్‌పీసీఎల్‌కు చేర్చారు. 70 మీటర్ల పొడవు కలిగిన ఈ రియాక్టర్‌ 2,800 టన్నుల బరువు ఉంటుంది. ఇప్పటివరకు ఇటువంటి రియాక్టర్లు గుజరాత్‌ నుంచి హెచ్‌పీసీఎల్‌కు మూడు చేరాయి. ఈ రియాక్టర్లు చమురును పూర్తిస్థాయిలో శుద్ధి చేసేందుకు ఉపయోగపడతాయని సంస్థ అధికారులు తెలిపారు. పర్యావరణానికి ముప్పు లేకుండా చమురును శుద్ధి చేయడంలో ఇవి కీలక భూమిక పోషిస్తాయని తెలిపారు.

Updated Date - 2021-05-19T09:56:52+05:30 IST