హార్లిక్స్, బూస్ట్.. బ్రాండ్లన్నీ కొనేసిన హిందుస్తాన్ యూనీలివర్..

ABN , First Publish Date - 2020-04-02T02:53:58+05:30 IST

ప్రముఖ హెల్త్ డ్రింక్ హార్లిక్స్ బ్రాండ్‌ను హిందుస్తాన్ యూనీలివర్(హెచ్‌యూఎల్) సంస్థ కొనుగోలు చేసింది. దీనికోసం హార్లిక్స్ మాతృసంస్థ గ్లాక్సోస్మిత్‌క్లైన్ (జీఎస్‌కే) నుంచి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

హార్లిక్స్, బూస్ట్.. బ్రాండ్లన్నీ కొనేసిన హిందుస్తాన్ యూనీలివర్..

న్యూఢిల్లీ: ప్రముఖ హెల్త్ డ్రింక్ హార్లిక్స్ బ్రాండ్‌ను హిందుస్తాన్ యూనీలివర్(హెచ్‌యూఎల్) సంస్థ కొనుగోలు చేసింది. దీనికోసం హార్లిక్స్ మాతృసంస్థ గ్లాక్సోస్మిత్‌క్లైన్ (జీఎస్‌కే) నుంచి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ డీల్ విలువ అక్షరాలా 3,045కోట్లు. ఈ డీల్‌తో హెచ్‌యూఎల్, జీఎస్‌కే రెండు సంస్థలూ భారత మార్కెట్లో కలిసిపోయాయి. అంటే బూస్ట్, వివా, మాల్టోవా వంటి ఉత్పత్తులన్నీ కూడా హెచ్‌యూఎల్ కిందకే వస్తాయి. దీనికోసం జీఎస్‌కే సంస్థకు 5.7శాతం వాటా ఇస్తున్నట్లు సమాచారం. దీంతో కంపెనీలో హెచ్‌యూఎల్ వాటా  61.9శాతానికి తగ్గిపోతుంది. ఇప్పటి వరకు హెచ్‌యూఎల్ వద్ద 67.2శాతం షేర్లున్నాయి. జీఎస్‌కే సంస్థ బ్రిటన్‌కు చెందింది. హెచ్‌యూఎల్, జీఎస్‌కే కలయిక మార్కెట్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలియాలంటే కొంత వేచి చూడాల్సిందేనని నిపుణులంటున్నారు.

Updated Date - 2020-04-02T02:53:58+05:30 IST