నెల్లూరు జిల్లా: భార్యపై కొడవలి విసిరిన భర్త

ABN , First Publish Date - 2020-02-21T00:01:59+05:30 IST

నెల్లూరు: ఇంటి తాళం ఇవ్వలేదన్న కోపంతో భర్త.. భార్యపై కొడవలి విసిరాడు.

నెల్లూరు జిల్లా: భార్యపై కొడవలి విసిరిన భర్త

నెల్లూరు: ఇంటి తాళం ఇవ్వలేదన్న కోపంతో భర్త.. భార్యపై కొడవలి విసిరాడు. అదుపుతప్పి ఆ కొడవలి భార్య తలలో దిగింది. ఈ ఘటన నెల్లూరు జిల్లా, తోటపల్లి గూడూరు మండలం, సౌత్ ఆములూరులో జరిగింది. ఇదే ప్రాంతంలో శేషయ్య, జయమ్మ దంపతులు కొన్నేళ్లుగా నివాసం ఉంటున్నారు. గురువారం ఉదయం ఇంటి పక్కనే ఉన్న రూమ్ తాళం ఇవ్వమని భార్యను అడిగాడు. భర్తను పట్టించుకోకుండా భార్య తన పని తాను చేసుకుంటోంది. దీంతో ఆవేశానికి గురైన భర్త శేషయ్య భార్యపై కొడవలి విసిరాడు. ఆ కొడవలి అంచు ఆమె తలలో దిగింది. స్థానికులు జయమ్మను స్థానిక ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం ఆమెను చెన్నైకి తరలించారు.


అయితే కుక్కలపై కొడవలి విసిరితే అదుపుతప్పి భార్య తలకు తగిలిందని భర్త శేషయ్య చెబుతున్నాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భార్యను చూసేందుకు వచ్చిన శేషయ్యను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Updated Date - 2020-02-21T00:01:59+05:30 IST