Abn logo
Aug 1 2021 @ 12:47PM

హైదరాబాద్: దొంగల హల్ చల్

హైదరాబాద్: నగరంలోని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి, గుండ్లపోచంపల్లిలో దొంగలు హల్ చల్ చేశారు. మున్సిపల్ కార్యాలయం సమీపంలోని ఓ షాపులో చోరీ చేశారు. రూ. 35వేల నగదు, 40 తులాల వెండి దోచుకుపోయారు. అక్కడే ఉన్న మరో జ్యూయలరీ షాపులో కూడా దొంగతనానికి యత్నించారు. కానీ ఆ ప్రయత్నం సఫలం కాలేదు. ఈ దృశ్యాలన్నీ సీసీ టీవీలో రికార్డు అయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.