గాంధీభవన్ బస్టాప్‌లో బస్సుడ్రైవర్, పోలీసులపై దాడి

ABN , First Publish Date - 2021-01-22T04:02:20+05:30 IST

గాంధీభవన్ బస్టాప్‌లో బస్సు డ్రైవర్, పోలీసులపై దాడి జరిగింది. ఫలక్‌నామా డిపోకు చెందిన పఠాన్ చెరువు (218) నెంబర్ గల బస్సు పఠాన్ చెరువు నుంచి..

గాంధీభవన్ బస్టాప్‌లో బస్సుడ్రైవర్, పోలీసులపై దాడి

హైదరాబాద్: గాంధీభవన్ బస్టాప్‌లో బస్సు డ్రైవర్, పోలీసులపై దాడి జరిగింది. ఫలక్‌నామా డిపోకు చెందిన పఠాన్ చెరువు (218) నెంబర్ గల బస్సు పఠాన్ చెరువు నుంచి ఫలక్‌నామా వెళ్తుండగా గాంధీభవన్ బస్టాప్ వద్ద ఓ బైకును వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ సైడ్ లైట్ ధ్వంసమైంది. దీంతో బస్సుడ్రైవర్‌పై బైక్ దారుడు, అతని స్నేహితులు దాడి చేశారు. అడ్డుకున్నబేగంబజార్ కానిస్టేబుల్‌పై కూడా దాడి చేశారు. ఈ ఘటనతో గాంధీ భవన్ బస్టాప్ వద్ద రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. బస్సును పీఎస్‌కు తరలించారు. పోలీసులపై దాడి చేసిన పలువురిపై కేసు నమోదు చేశారు. 


Updated Date - 2021-01-22T04:02:20+05:30 IST