‘రెమ్‌డెసివిర్‌’ తయారీ రేసులో హైదరాబాద్‌ కంపెనీలు

ABN , First Publish Date - 2020-05-07T05:32:18+05:30 IST

కొవిడ్‌ రోగులకు యాంటీ వైరల్‌ ఔషధం ‘రెమ్‌డెసివిర్‌’తో చికిత్స చేయడానికి అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ యూఎ్‌సఎ్‌ఫడీఏ అనుమతి ఇచ్చింది. కరోనాపై రెమ్‌డెసివిర్‌ ప్రభావాన్ని తెలుసుకోవడానికి...

‘రెమ్‌డెసివిర్‌’ తయారీ రేసులో హైదరాబాద్‌ కంపెనీలు

  • గిలీడ్‌ సైన్సెస్‌ నుంచి లైసెన్స్‌ పొందే యత్నాలు!
  • కొవిడ్‌-19 చికిత్సకు యూఎ్‌సఎ్‌ఫడీఏ తాత్కాలిక అనుమతి

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌) : కొవిడ్‌  రోగులకు యాంటీ వైరల్‌  ఔషధం ‘రెమ్‌డెసివిర్‌’తో చికిత్స చేయడానికి అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ యూఎ్‌సఎ్‌ఫడీఏ అనుమతి ఇచ్చింది. కరోనాపై రెమ్‌డెసివిర్‌ ప్రభావాన్ని తెలుసుకోవడానికి దీనిపై ప్రస్తుతం క్లినికల్‌ పరీక్షలు జరుగుతున్నప్పటికీ.. ఇది ఉపయోగించిన కొంత మంది రోగులు త్వరగా కోలుకోవడంతో బయో ఫార్మా కంపెనీ గిలీడ్‌ సైన్సె్‌సకు ఎమర్జెన్సీ యూజ్‌ అథరైజేషన్‌ (ఈయూఏ) జారీ చేసినట్లు యూఎ్‌సఎ్‌ఫడీఏ వెల్లడించింది.


కరోనా వైర్‌స కట్టడిలో ఇది కీలకమైన మలుపుగా ఆ సంస్థ భావిస్తోంది. ఈ ఔషధాన్ని నేరుగా రోగుల రక్త నాళాలకు ఇస్తారు. దీనిపై గిలీడ్‌కు 2035 వరకు మేధో సంపత్తి హక్కులున్నాయి. కొవిడ్‌ చికిత్సలో ఇది ఎంత భద్రం, సమర్థవంతం పరిశీలించడానికి ఏడు క్లినికల్‌ పరీక్షలు చేపట్టామని ఇటీవల గిలీడ్‌ చైర్మన్‌, సీఈఓ డేనియల్‌ ఓ డే తెలిపారు. ఇప్పటి వరకూ లభించిన డేటా ప్రకారం కొవిడ్‌  రోగులు కోలుకోవడానికి ఈ ఔషధం దోహదం చేసిందని అన్నారు. అమెరికాకు చెందిన నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌  ఆఫ్‌ అలర్జీ అండ్‌ ఇన్ఫెక్షస్‌ డిసీసెస్‌ (ఎన్‌ఐఏఐడీ) నిర్వహించిన ప్లాసిబో-కంట్రోల్‌ పరీక్షలో సానుకూల ఫలితాలు వచ్చాయని కంపెనీ పేర్కొంది. ప్లాసిబో పరీక్షలో ఔషధాన్ని తీసుకున్న రోగుల కంటే వేగంగా బయట కోవిడ్‌-19 రోగులు కోలుకున్నారని తెలిపింది.




2014లో తయారీ..

ఎబోలా వైర్‌సకు చికిత్స చేయడానికి 2014లో గిలీడ్‌ సైన్సెస్‌ ఈ ఔషధాన్ని అభివృద్ధి చేసింది. ఎబోలా, హెపటైటిస్‌ చికిత్సలో ఇది విజయం సాధించలేదు. కరోనా కుటుంబానికి చెందిన మెర్స్‌, సెర్స్‌కు చికిత్సలో కూడా ఆశించిన ఫలితాలు కనిపించలేదు. కాని కొవిడ్‌ రోగులకు చికిత్సలో కొంత సానుకూల ఫలితాలుండడంతో తాత్కాలికంగా అత్యవసర వినియోగానికి యూఎ్‌సఎ్‌ఫడీఏ అనుమతి ఇచ్చింది. భారత్‌లో కూడా దీన్ని ప్రయోగాత్మకంగా వినియోగించనున్నారని, ఇప్పటికే భారత్‌కు 1000 డోసుల రెమ్‌డెసివిర్‌ వచ్చిందని కొందరంటున్నారు. అమెరికాలో కొవిడ్‌  రోగులకు చికిత్స చేయడానికి అనుమతించిన తొలి ఔషధం ఇదే. 


గతంలో లాగా లైసెన్స్‌...

హైదరాబాద్‌కు చెందిన డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌, నాట్కో ఫార్మా, లారస్‌ ల్యాబ్స్‌ దీని జనరిక్‌ వెర్షన్‌ తయారు చేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. గిలీడ్‌ సైన్సెస్‌ నుంచి తయారీ లైసెన్సు పొందేందుకు ప్రయత్నిస్తున్నాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. హెపటైటి్‌స-సి పోర్టుఫోలియో ఔషధాల తయారీలో లారస్‌ ల్యాబ్స్‌కు, నాట్కో ఫార్మాకు గిలీడ్‌తో భాగస్వామ్య ఒప్పందం ఉందని, దీన్ని జనరిక్‌  రెమ్‌డెసివిర్‌ తయారీకి కూడా విస్తరించవచ్చన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. సిప్లా, గ్లెన్‌మార్క్‌ కూడా దీన్ని తయారు చేయడానికి సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ముడి పదార్థాలు, ఏపీఐలపై భారత కంపెనీలు దృష్టి పెట్టినట్లు చెబుతున్నారు. ఇందుకు అవసరమైన కీలక ముడి పదార్థాలను సిద్ధం చేసినట్లు ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ (ఐఐసీటీ) ఇప్పటికే వెల్లడించింది. గతంలో హెపటైటిస్‌ సి ఔషధం ‘సోవాల్డీ’ తక్కువ ధరకు అందుబాటులోకి తీసుకురావడానికి సిప్లా, అప్పటి రాన్‌బాక్సీ లేబొరేటరీ్‌సకు గిలీడ్‌ అనుమతి ఇచ్చింది. వివిధ దేశాలకు కూడా భారత కంపెనీలు సోవాల్డీ సరఫరా చేశాయి.


ఈ నేపథ్యంలో రెమ్‌డెసివిర్‌ జనరిక్‌ వెర్షన్ల విడుదలకు గిలీడ్‌ సైన్సెస్‌ స్వచ్ఛంద లైసెన్స్‌ ఒప్పందాలను కుదుర్చుకోవచ్చన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. తయారీ సామర్థ్యాలను పెంచుకోవడానికి ఉత్తర అమెరికా, యూరప్‌, ఆసియాల్లో ఫార్మా కంపెనీలతో చేతులు కలపనున్నట్లు గిలీడ్‌ పేర్కొంది. కొవిడ్‌ -19 చికిత్సలో అది పని చేస్తుందని నిరూపితమైతే.. భారత  కంపెనీలు జనరిక్‌ వెర్షన్లను అభివృద్ధి చేసే విధంగా చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు ఇప్పటికే ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రిసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) సూచనప్రాయంగా తెలిపింది. 


Updated Date - 2020-05-07T05:32:18+05:30 IST