Abn logo
Sep 12 2021 @ 17:55PM

ఎల్బీనగర్‌లో దొంగల బీభత్సం.. గణేశ్ మండపంలో చోరీ

హైదరాబాద్: ఎల్బీనగర్‌లోని శివమ్మ కాలనీలో శ్రీ సాయి అయ్యప్ప అపార్ట్ మెంట్ లో ఏర్పాటు చేసిన గణపతి మండపంలో చోరీ జరిగింది. అర్ధరాత్రి సమయంలో సుమారు 8 మంది యువకులు వెళ్లి చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటనలో రెండు సౌండ్ బాక్సులు, హుండీ ఎత్తుకెళ్లారు. ఈ దృశ్యాలు స్థానిక సీసీ కెమెరాల్లో నమోదు అయ్యాయి.