బ్రిటన్‌లో హైద్రాబాదీకి అరుదైన గౌరవం !

ABN , First Publish Date - 2020-09-12T01:00:26+05:30 IST

బ్రిటన్‌లో హైదరాబాద్‌కు చెందిన తెలుగు వైద్యుడికి అరుదైన గౌరవం దక్కింది.

బ్రిటన్‌లో హైద్రాబాదీకి అరుదైన గౌరవం !

హైదరాబాద్: బ్రిటన్‌లో హైదరాబాద్‌కు చెందిన తెలుగు వైద్యుడికి అరుదైన గౌరవం దక్కింది. కౌన్సిలర్‌గా పని చేస్తున్న చంద్ర కన్నెగంటి అనే హైద్రాబాదీ బ్రిటన్‌లోని స్ట్రోక్ ఆన్ ట్రెంట్ సిటీ డిప్యూటీ లార్డ్ మేయర్‌గా ఎన్నికయ్యారు. గురువారం ఆయన తన కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. కాగా, ఈ పదవి చేపట్టిన తొలి తెలుగు వ్యక్తి చంద్రనే కావడం విశేషం.


కన్జర్వేటివ్ పార్టీ తరఫున బరిలోకి దిగిన చంద్రకు 23 ఓట్లు పోలు కాగా... అతని ప్రత్యర్థి లేబర్ పార్టీ అభ్యర్థికి 20 ఓట్లు వచ్చాయి. దీంతో మూడు ఓట్ల తేడాతో చంద్ర డిప్యూటీ లార్డ్ మేయర్‌ పదవి దక్కించుకున్నారు. ప్రస్తుతం ఆయన గోల్డెన్‌హిల్, సాండీఫోర్డ్ కౌన్సిలర్‌గా కొనసాగుతున్నారు. డిప్యూటీ లార్డ్ మేయర్‌గా ఎన్నికవ్వడం పట్ల చంద్ర ఆనందం వ్యక్తం చేశారు. ఇది తనకు దక్కిన అత్యున్నత గౌరవంగా ఆయన పేర్కొన్నారు. కాగా, తాను 2006లో స్ట్రోక్ ఆన్ ట్రెంట్ సిటీకి రావడం జరిగిందని, తనకు ఈ ప్రాంతం ఎంతో నచ్చిందని తెలిపారు.  

Updated Date - 2020-09-12T01:00:26+05:30 IST