తెలంగాణ గల్ఫ్ కార్మికుల కోసం ఐసీబీఎఫ్ ప్రమాద బీమా పథకం

ABN , First Publish Date - 2020-09-26T11:53:17+05:30 IST

ఖతార్‌లో నివసించే భారతీయ పౌరులకోసం ఐసీబీఎఫ్ వారి బీమా పథకం పునః ప్రారంభ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి కార్యవర్గం పాల్గొనడం జరిగింది.

తెలంగాణ గల్ఫ్ కార్మికుల కోసం ఐసీబీఎఫ్ ప్రమాద బీమా పథకం

తెలంగాణ గల్ఫ్ కార్మికులు ఐసీబీఎఫ్ ప్రమాద బీమా పథకాన్ని ఉపయోగించుకోవాలి: తెలంగాణ జాగృతి ఖతర్ అధ్యక్షురాలు నందిని అబ్బగౌని

ఖతార్‌లో నివసించే భారతీయ పౌరులకోసం ఐసీబీఎఫ్ వారి బీమా పథకం పునః ప్రారంభ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి కార్యవర్గం పాల్గొనడం జరిగింది. ఖతార్‌లోని తెలుగు కమ్యూనిటీ కోసం ప్రత్యేకంగా ఐసీబీఎఫ్ వారు జూమ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ జాగృతి ఖతార్ అధ్యక్షురాలు నందిని అబ్బగౌని మాట్లాడుతూ.. తెలంగాణ గల్ఫ్ కార్మిక సోదరులు ఈ బీమా పథకాన్ని ఉపయోగించుకోవాలని కోరారు.


ఊహించని సంఘటనలు జరిగితే మీ కుటుంబానికి మెరుగైన జీవితం కోసం ఆసరాగా ఉంటుందని, అందుకే దీనిని ఉపయోగించుకోవాలని తెలంగాణ జాగృతి ఖతార్ ద్వారా కోరుతున్నం అని ఆమె తెలిపారు. కేవలం 125 రియాల్‌ల ప్రీమియంతో దాదాపు రూ.20 లక్షల ప్రమాద బీమా సౌకర్యం ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఐసీబీఎఫ్ కార్యవర్గంతో పాటు తెలంగాణ జాగృతి ఖతార్ నాయకులు హారిక ప్రేమ్, సాయి చింతలపూడి, స్వప్న కేశా, ఎల్లయ్య తాళ్లపెళ్లి, అహ్మద్ మొహిద్దిన్, చందన రెడ్డి, ప్రగతి, రేఖా సాయి, రాజేశ్వరి రుద్ర తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-09-26T11:53:17+05:30 IST