Advertisement
Advertisement
Abn logo
Advertisement

ICC RANKINGS: టాప్ త్రీలో కోహ్లీ, రోహిత్!

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ వన్డే ర్యాంక్సింగ్స్‌లో తమ స్థానాలను నిలబెట్టుకున్నారు. ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో కోహ్లీ, రోహిత్ వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు.  కోహ్లీ ఖాతాలో 857 రేటింగ్‌ పాయింట్లు ఉండగా, రోహిత్‌ ఖాతాలో 825 రేటింగ్‌ పాయింట్లు ఉన్నాయి. ఈ జాబితాలో పాకిస్థాన్ బ్యాట్స్‌మెన్ బాబర్ అజామ్ (865) అగ్రస్థానంలో ఉన్నాడు.


ఇక, బౌలింగ్ విభాగంలో బుమ్రా కూడా తన ఐదో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. 690 రేటింగ్ పాయింట్లతో బుమ్రా ఐదో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో న్యూజిలాండ్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ అగ్రస్థానంలో ఉన్నాడు. ఆల్‌రౌండర్ల జాబితాలో టీమిండియా ఆటగాడు రవీంద్ర జడేజా తొమ్మిదో స్థానంలో నిలిచాడు. ఈ లిస్ట్‌లో బంగ్లా సీనియర్‌ ఆల్‌రౌండర్‌ షకీబ్‌ అల్‌ హసన్‌ నెంబర్ వన్‌గా ఉన్నాడు. ఇక, టీమ్ ర్యాంక్సింగ్స్‌లో న్యూజిలాండ్ (121), ఆస్ట్రేలియా (118), భారత్ (115), ఇంగ్లండ్ (115) వరుసగా తొలి నాలుగు స్థానాల్లో నిలిచాయి. 

Advertisement
Advertisement