ఐసీఐసీఐ మార్కెట్ క్యాప్‌..... రూ. 5 లక్షల కోట్లు దాటింది...

ABN , First Publish Date - 2021-09-02T00:44:58+05:30 IST

ప్రైవేటురంగంలోని ఐసీఐసీఐ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్‌ మొట్టమొదటిసారి రూ. 5 లక్షల కోట్లు దాటింది.

ఐసీఐసీఐ మార్కెట్ క్యాప్‌..... రూ. 5 లక్షల కోట్లు దాటింది...

ముంబై : ప్రైవేటురంగంలోని ఐసీఐసీఐ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్‌ మొట్టమొదటిసారి రూ. 5 లక్షల కోట్లు దాటింది. ఈ ఘనత సాధించిన రెండో బ్యాంకుగా ఐసీఐసీఐ అవతరించింది. బ్యాంకుల్లో, ఆస్తుల ప్రాతిపదికన దేశంలోనే అతిపెద్ద రుణదాతగా ఉన్న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్... రూ. 8.7 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్‌తో అగ్రస్థానంలో ఉంది. రూ. 3.81 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్‌తో ఎస్‌బీఐ మూడవ స్థానంలో ఉంది. కోటక్ మహీంద్రా బ్యాంక్ నాలుగో వ స్థానంలో(రూ. 3.47 లక్షల కోట్లు), యాక్సిస్ బ్యాంక్ 5 వ స్థానంలో (రూ. 2.46 లక్షల కోట్లు) ఉన్నాయి. 


మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఐసీఐసీఐ బ్యాంక్ స్టాక్ బీఎస్ఈలో 0.79 శాతం పెరిగి రూ. 724.50 వద్ద ట్రేడవుతోంది. దాని మార్కెట్ క్యాప్ రూ. 5,01,202 కోట్లు. నేడు స్టాక్ రికార్డ్ గరిష్టం రూ. 734.85 కు చేరింది. కాగా... రిటర్న్స్ విషయానికొస్తే... ఎస్‌బీఐ తర్వాత రెండో అతి పెద్ద లాభాన్నార్జించిన సంస్థగా 95 శాతం లాభంతో ఐసీఐసీఐ బ్యాంక్ నిలవడం గమనార్హం.

Updated Date - 2021-09-02T00:44:58+05:30 IST