దేశానికే తెలంగాణ దిక్సూచి

ABN , First Publish Date - 2020-06-03T09:21:23+05:30 IST

తెలంగాణలో సీఎం కేసీఆర్‌ చేపడుతున్న సంక్షేమ పథకాలు దేశానికే దిక్సూచిగా మారాయని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ వెంకటేశ్వర్లు

దేశానికే తెలంగాణ దిక్సూచి

సంక్షేమ పథకాల అమలులో ఆదర్శం

ప్రభుత్వ చీఫ్‌విప్‌ బి.వెంకటేశ్వర్లు

నిరాడంబరంగా రాష్ట్ర అవతరణ వేడుకలు


జనగామ, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి) :  తెలంగాణలో సీఎం కేసీఆర్‌ చేపడుతున్న సంక్షేమ పథకాలు దేశానికే దిక్సూచిగా మారాయని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ వెంకటేశ్వర్లు కొనియాడారు. అన్ని రాష్ర్టాలకు ఆదర్శంగా నిలిచాయని పేర్కొన్నారు. కలెక్టరేట్‌ ఆవరణలో మంగళవారం జరిగిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై పతాకాన్ని ఎగుర వేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతును రాజును చేయాలనే సంకల్పంతో నియంత్రిత పంటలసాగు విధానాన్ని ప్రవేశపెట్టి, అభివృద్ధి బాటలు వేసేందుకు కృషి చేస్తున్నారన్నారు.  రైతుబంధు పథకం ద్వారా జిల్లాలో 89,713మంది రైతుల ఖాతాలలో రూ.101కోట్లు జమ చేయడం జరిగిందన్నారు. పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా 281 గ్రామ పంచాయతీల్లో రూ.80కోట్ల ఖర్చుతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని వెంకటేశ్వర్లు వెల్లడించారు. భూ రికార్డుల ప్రక్షాళన ద్వారా జనగామ జిల్లాలో 1.67లక్షల పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేశామన్నారు. జనగామ మునిసిపాలిటీ పరిధిలో ప్రతీ వార్డుకు ప్రత్యేక అధికారులను నియమించి పట్టణప్రగతి పనులు చేస్తున్నట్లు తెలిపారు. 


సాదాసీదాగా.. 

జనగామ కలెక్టరేట్‌ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్‌విప్‌ బోడకుంటి వెంకటేశ్వర్లు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, జడ్పీ చైర్మన్‌ పాగాల సంపత్‌రెడ్డి, మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ పి.జమున, కలెక్టర్‌ కె.నిఖిలతో కలిసి తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం ముఖ్యఅతిథి జాతీయపతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం కలెక్టరేట్‌లో నిర్వహించిన ‘ఎట్‌ ద హోం’లో తేనీటి విందు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా కో-ఆర్డినేటర్‌ ఇర్రి రమణారెడ్డి, డీసీపీ బి.శ్రీనివా్‌సరెడ్డి, ఏసీపీ వినోద్‌కుమార్‌, ఆర్డీవో మధుమోహన్‌, అధికారులు పాల్గొన్నారు. 


జనగామ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు బండ యాదగిరిరెడ్డి, చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు పోకల లింగయ్య పాల్గొన్నారు. బీజేపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు దశమంత్‌రెడ్డి జాతీయపతాకాన్నిఆవిష్కరించారు. జిల్లా పరిషత్‌ కార్యాలయంలో చైర్మన్‌ సంపత్‌రెడ్డి పతాకావిష్కరణ చేయగా, మండలపరిషత్‌ కార్యాలయంలో ఎంపీపీ కళింగరాజు జెండా ఎగురవేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఆయా శాఖల అధికారులు పతాకాలను ఎగురవేశారు. కాంగ్రె్‌స పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి జాతీయపతాకాన్ని ఎగురవేశారు. అలాగే బచ్చన్నపేట, చిలుపూర్‌, నర్మెట, కొడకండ్ల, జఫర్‌గడ్‌, లింగాలఘణపురం, రఘునాథపల్లి, దేవరుప్పుల మండల్లాలో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు జరిగాయి.


స్టేషన్‌ఘన్‌పూర్‌ టౌన్‌/స్టేషన్‌ఘన్‌పూర్‌ : మండలంలో నిర్వహించిన రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో ఎమ్మెల్యే రాజయ్య జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంతో పాటు ఎంపీడీవో కార్యాలయంలో వేడుకల్లో ఆయన హాజరై మాట్లాడారు. ఆర్డీవో రమేశ్‌, చిలుపూరు దేవస్థానం చైర్మన్‌ నర్సింహరెడ్డి, కుడా డైరెక్టర్‌ ఆకుల కుమార్‌, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, ఎంపీపీలు పాల్గొన్నారు. అలాగే కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో స్టేషన్‌ ఘన్‌పూర్‌లో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.


పాలకుర్తి : మండలంలో ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో వేడుకలు నిర్వహించారు. తహసీల్దార్‌ విజయభాస్కర్‌, ఎంపీపీ నల్ల నాగిరెడ్డి, సర్పంచ్‌ వీరమనేని యాకాంతరావు, సీఐ రమేష్‌, డాక్టర్‌ యామిని, ఆబ్కారీ స్టేషన్‌లో ఎస్సై అంజయ్య, మార్కెట్‌లో చైర్మన్‌ ముస్కు రాంబాబు జెండాలను ఆవిష్కరించారు. టీఆర్‌ఎస్‌ కార్యాలయంలో మండల అధ్యక్షుడు పసునూరి నవీన్‌, కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు గిరగాని కుమారస్వామి, ప్రభుత్వ, ప్రవేటు పాఠశాలల్లో జాతీయ పతకాలను ఎగురవేశారు. 

Updated Date - 2020-06-03T09:21:23+05:30 IST