‘బగ్’లను గుర్తిస్తే : గూగుల్

ABN , First Publish Date - 2021-08-02T23:24:50+05:30 IST

వీఆర్‌పీ కార్యక్రమంలో మార్పులు చేస్తున్నట్లు గూగుల్ వెల్లడించింది. వీఆర్‌పనీ ప్రోగ్రాంకు బదులు 'బగ్‌ హంటర్‌' పేరుమీద కొత్త వెబ్‌‌సైట్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే.

‘బగ్’లను గుర్తిస్తే  : గూగుల్

శాక్రిమెంటో :  వీఆర్‌పీ కార్యక్రమంలో మార్పులు చేస్తున్నట్లు గూగుల్ వెల్లడించింది. వీఆర్‌పనీ ప్రోగ్రాంకు బదులు 'బగ్‌ హంటర్‌' పేరుమీద కొత్త వెబ్‌‌సైట్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. తద్వారా  గూగుల్‌కు చెందిన... గూగుల్‌ సెర్చ్‌ ఇంజిన్‌, ఆండ్రాయిడ్‌, గూగుల్‌ క్రోం‌, గూగుల్‌ ప్లేస‍్టోర్‌లలో లోపాలను గుర్తించవచ్చని, ఆ ప్రక్రియ  అంతా ఈ వెబ్‌ ద్వారానే జరుగుతుందని వెల్లడించింది. 


అంతేకాకుండా... గామిఫికేషన్ సాఫ్ట్‌వేర్‌ వ్యవస్థను  అభివృద్ధి చేయాలని కూడా  గూగుల్‌ భావిస్తోంది. ఆ క్రమంలోనే... గామిఫికేషన్‌లో లోపాలను గుర్తించిన వారికి 'అవార్డులు, బ్యాడ్జ్‌లను'  కేటాయించనుంది. అంతేకాదు... జాబ్‌ చేయాలనుకుంటే  వీఆర్‌పీ బృందంతో కలిసి పనిచేయవచ్చని కంపెనీ పేర్కొంది. కాగా... వీఆర్పీ సభ్యుల సహకారంతో 0-20 లోపాలను ను గుర్తిస్తారనే అంచనా ఉంది. అయితే... అనూహ్యంగా 25 బగ్‌లను గుర్తించి, అంచనాలను తల్లకిందులు చేసినట్లు గూగుల్‌ తన బ‍్లాగ్‌ లో పేర్కొంది. కాగా, బగ్స్‌ ను గుర్తించేందుకు 84 దేశాల్లో పెయిడ్‌ రీసెర‍్చర్స్‌ ఉన్నట్లు స్పష్టం చేసింది. అంతేకాదు...  కొత్తగా మార్పులు చేసిన ఈ వీఆర్పీ ప్రోగ్రాం ద్వారా ఔత్సాహికులు తమ నైపుణ్యాలను పెంపొందించుకోవచ్చునని పేర్కొంది. ఇక... లోపాలను గుర్తించిన వారికి... వేరబిలిటీ రివార్డ్ ప్రోగ్రాం (వీఆర్పీ)ప్రోగ్రాంలో భాగంగా భారీ నజరానాను ఇవ్వనున్నట్లు గూగుల్ ప్రకటించింది. 

Updated Date - 2021-08-02T23:24:50+05:30 IST