రోజుకు రూ. 22 పొదుపు చేస్తే... రూ. 8 లక్షలు పొందొచ్చు…

ABN , First Publish Date - 2021-04-22T21:37:14+05:30 IST

డబ్బు పొదుపు చేయాలని భావిస్తున్నారా ? అయితే తపాలా శాఖ ఓ పథకాన్నందిస్తోంది.

రోజుకు రూ. 22 పొదుపు చేస్తే... రూ. 8 లక్షలు పొందొచ్చు…

న్యూఢిల్లీ : డబ్బు పొదుపు చేయాలని భావిస్తున్నారా ? అయితే తపాలా శాఖ ఓ పథకాన్నందిస్తోంది. ఇందులో అతి తక్కువ మొత్తంలో పొదుపు చేసినప్పటికీ... భారీ మొత్తాన్ని సొంతం చేసుకునే వెసులుబాటు ఉంది. అంటే... రోజుకు రూ. 22 ఆదా చేస్తే... ఏకంగా రూ. 8 లక్షలను సొంతం చేసుకోవచ్చు. వివరాలిలా ఉన్నాయి... 


డబ్బు పొదుపు చేయాలని భావిస్తున్నట్లయితే... తపాలా శాఖ ఓ ఓ పథకాన్నందిస్తోంది. అదే... ‘గ్రామ్ సంతోష్’ ఇన్సూరెన్స్ స్కీమ్. కేవలం రూ.22 తో ఈ పాలసీ తీసుకుంటే... ఏకంగా రూ. 8 లక్షలను సొంతం చేసుకోవచ్చు. గ్రామ్ సంతోష్... ఎండోమెంట్ అస్యూరెన్స్ స్కీమ్. ఇందులో... 19-55 ఏళ్ల వయసు కలిగిన వారు  చేరొచ్చు. కనీసం రూ. 10 వేల భీమా మొత్తానికి ఈ పాలసీని తీసుకోవచ్చు. గరిష్టంగా రూ. 10 లక్షల భీమా మొత్తానికి పాలసీ పొందొచ్చు. పాలసీ టర్మ్ 35, 40, 45, 50, 58, 60 ఏళ్లుగా ఉంటుంది.  అంటే పాతికేళ్ళ వయస్సున్న వ్యక్తి రూ. 3 లక్షల మొత్తానికి పాలసీ తీసుకున్నాడనుకుంటే...  మెచ్యూరిటీ కాలంలో 35 ఏళ్లకు రూ. 4.44 లక్షలు, 40 ఏళ్లకు రూ. 5.16 లక్షలు, 45 ఏళ్లకు రూ. 5.88 లక్షలు, 50 ఏళ్లకు రూ. 6.6 లక్షలు, 55 ఏళ్లకు రూ. 7.3 లక్షలు, 58 ఏళ్లకు రూ. 7.7 లక్షలు, 60 ఏళ్ళకు రూ. 8.04 లక్షలు పొందొచ్చు. 


అలాగే నెలవారీ ప్రీమియంలో 35 ఏళ్లకు రూ. 3,518, 40 ఏళ్లకు రూ. 1,693, 45 ఏళ్లకు రూ. 1,223, 50 ఏళ్లకు టర్మ్‌కు రూ. 956, 55 ఏళ్ల టర్మ్‌కు రూ. 768, 58 ఏళ్లకు రూ. 690, 60 ఏళ్లకు రూ. 643. ఒక వేళ పాతికేళ్ల వయసులో పాలసీ తీసుకుంటే... 60 ఏళ్ల రిటైర్మెంట్ ఆప్షన్ ఎంచుకుంటే... నెలకు రూ. 643 చొప్పున 35 ఏళ్ళు ప్రీమియం కట్టాల్సి ఉంటుంది. అంటే... రోజుకు రూ. 22 ఆదా చేస్తే మెచ్యూరిటీ సమయంలో రూ. 8.4 లక్షలు పొందోచ్చు అన్నమాట. కాగా... దీంతోపాటు ఇదే తరహాలో ఉన్న మరికొన్ని పథకాలను ప్రజల్లోకి మరింత స్థాయిలో తీసుకునివెళ్ళాలన్న సంకల్పంతో తపాలా శాఖ యత్నిస్తోంది. 

Updated Date - 2021-04-22T21:37:14+05:30 IST