నిజమే... 70 విమానాల కొనుగోలుకు రాకేశ్ ప్లాన్

ABN , First Publish Date - 2021-07-28T23:08:21+05:30 IST

రాకేష్ ఝన్‌ఝన్‌వాలా... దేశంలోనే ప్రముఖ ‘స్టాక్ అనలిస్ట్. మార్కెట్ విషయాల్లో తనదైన పేరును సంపాదించుకున్న ఈ దిగ్గజ విశ్లేషకుడు... నాలుగేళ్లలో భారతదేశంలో అతి తక్కువ ఖర్చుతో కూడిన విమానయాన సంస్థ కోసం 70 విమానాలను కొనుగోలు చేయాలని, తద్వారా... పెద్దసంఖ్యలో పేద, మధ్యతరగతి ప్రజలు విమానాల్లో ప్రయాణించేలా యత్నాలు చేస్తున్నారు.

నిజమే... 70 విమానాల కొనుగోలుకు రాకేశ్ ప్లాన్

ముంబై : రాకేష్ ఝన్‌ఝన్‌వాలా... దేశంలోనే ప్రముఖ ‘స్టాక్ అనలిస్ట్. మార్కెట్ విషయాల్లో తనదైన పేరును సంపాదించుకున్న ఈ దిగ్గజ విశ్లేషకుడు... నాలుగేళ్లలో భారతదేశంలో అతి తక్కువ ఖర్చుతో కూడిన విమానయాన సంస్థ కోసం 70 విమానాలను కొనుగోలు చేయాలని, తద్వారా... పెద్దసంఖ్యలో పేద, మధ్యతరగతి ప్రజలు విమానాల్లో ప్రయాణించేలా యత్నాలు చేస్తున్నారు. దీని కోసం ఆయన ఇండియన్ ఏవియేషన్ మినిస్ట్రీ నుంచి మరో పదిహేను రోజుల్లో ‘నో అబ్జెక్షన్’ సర్టిఫికెట్ తీసుకోనున్నారు. ఈ వివిరాలను ఆయనే  స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. మరిన్ని వివరాలిలా ఉన్నాయి. 


 అల్ట్రా లో కాస్ట్ ఎయిర్‌లైన్‌‌గా వ్యవహరించనున్న ‘అకాస ఎయిర్’... దాని బృందం... డెల్టా ఎయిర్‌లైన్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్‌‌లతో కూడిన బృందం... 180 మంది ప్రయాణికులను తీసుకెళ్లగలిగే విమానాలను పరిశీలిస్తోందని రాకేశ్ ఝన్‌ఝన్‌వాలా వెల్లడించారు. మార్కెట్‌లో చార్జీల మోత, అధిక వ్యయాల కారణంగా కొన్ని విమానయాన సంస్థలు కూలిపోవడాన్ని చూసిన తరువాత కూడా రాకేశ్ ఝన్‌ఝన్‌వాలా ఈ నిర్ణయం తీసుకోవడం నిజంగా సాహసోపేతమేనన్న వ్యాఖ్యానాలు ఈ సందర్భంగా వెల్లువెత్తుతున్నాయి. 

Updated Date - 2021-07-28T23:08:21+05:30 IST