Advertisement
Advertisement
Abn logo
Advertisement

అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదు: అమర్నాథరెడ్డి

చిత్తూరు: మాజీ మంత్రి అమర్నాథరెడ్డి, హౌస్‌ అరెస్ట్‌ నుంచి తప్పించుకొని కుప్పం టీడీపీ ఆఫీస్‌కు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కుప్పంలో వైసీపీ గుండాలు తిరుగుతున్నారని దుయ్యబట్టారు. అర్థరాత్రి అరెస్ట్‌ చేయడానికి తా తీవ్రవాదులమా? అని ప్రశ్నించారు. మున్సిపల్ ఎన్నికల్లో అక్రమాలు జరుగుతున్నాయని, ఫిర్యాదు చేయడానికి వెళ్తే తనపైనే కేసులు పెడతున్నారని తెలిపారు. అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. వైసీపీ అరాచకానికి ప్రజలు భయాందోళన చెందుతున్నారని చెప్పారు. కుప్పంలో 25 వార్డులకు 13 ఏకగ్రీవం చేయాలని చూశారని, ఎన్నికలు సజావుగా జరిపించకుంటే ఛలో కుప్పంకి పిలుపు ఇస్తామని అమర్నాథరెడ్డి ప్రకటించారు.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement