ఏపీ ప్రభుత్వానికి ఐఎండీ రెడ్‌ నోటీసులు

ABN , First Publish Date - 2021-11-12T23:50:20+05:30 IST

దేశంలో ఆంధ్రప్రదేశ్ పరువు పోయింది. ఆంధ్రప్రదేశ్‌ వైద్య

ఏపీ ప్రభుత్వానికి ఐఎండీ రెడ్‌ నోటీసులు

అమరావతి: దేశంలో ఆంధ్రప్రదేశ్ పరువు పోయింది. ఆంధ్రప్రదేశ్‌ వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థకు ఇండియన్‌ మెడికల్‌ డివైసెస్‌ రెడ్‌ నోటీసులను జారీ చేసింది. మెడికల్‌ ఉపకరణాలను ఏపీకి సరఫరా చేయవద్దని  ఐఎండీ ఇండస్ట్రీ ఆదేశాలు జారీ చేసింది. ఏపీఎంఎస్‌ఐడీసీకి పరికరాలు ఎవరు సరఫరా చేయవద్దని ఆదేశాలు ఇచ్చింది. నాలుగు సంవత్సరాల నుంచి ప్రభుత్వం బిల్లులు చెల్లించలేదని  సమాఖ్య తెలిపింది. సంప్రదింపులు జరిపినా ఉపయోగం లేదని సమాఖ్య పేర్కొంది. ఎవరైన సరఫరా చేస్తే వారి సొంత రిస్క్‌ అని నోటీస్‌లో సమాఖ్య వివరించింది. ఏపీ ప్రభుత్వ టెండర్లలో పాల్గొనరాదని హెచ్చరికలు జారీ చేసింది. వంద శాతం డబ్బు చెల్లిస్తేనే పరికరాలు సరఫరా చేయాలని పరిశ్రమలకు సూచించింది. ప్రభుత్వ తీరుపై వైద్య నిపుణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2021-11-12T23:50:20+05:30 IST