Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఇమ్యూనిటీ డ్రింక్‌

ఉన్నఫళాన రోగనిరోధకశక్తి పెంచుకోవడం సాధ్యంకాదు. కచ్చితమైన ఆహారనియమాలు పాటిస్తేనే అది క్రమంగా వృద్ధి చెందుతుంది. అలాంటిదే ఈ పానీయం. దీన్ని మీ మెనూలో చేర్చుకొంటే ఇమ్యూనిటీ బూస్టర్‌లా పనిచేస్తుంది. 



వాము, తులసితో... 

కావల్సినవి: అర టేబుల్‌ స్పూన్‌ వాము, 5 తులసి ఆకులు, అర టేబుల్‌ స్పూన్‌ నల్ల మిరియాల పొడి, ఒక టేబుల్‌ స్పూన్‌ తేనె. 

తయారీ: స్టవ్‌ మీద గిన్నె పెట్టి, అందులో గ్లాసు నీళ్లు పోసి, వాము, మిరియాల పొడి, తులసి ఆకులు వేయాలి. ఐదు నిమిషాలపాటు మరిగించాలి. స్టవ్‌ ఆఫ్‌ చేసి ఆ మిశ్రమాన్ని కప్పులోకి వడగట్టాలి. కొద్దిగా చల్లారిన తరువా తేనె కలుపుకుని తాగాలి. 

ప్రయోజనం: వాములో ఔషధ గుణాలు పుష్కలం. దీర్ఘకాల రోగాలు నయం చేయడానికి ఆయుర్వేదంలో దీన్ని విరివిగా ఉపయోగిస్తారు. ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు రోగనిరోధకశక్తిని పెంపొందిస్తాయి. సాధారణ జలుబు, దగ్గు నుంచి ఉపశమనం కలిగిస్తాయి. దీనికి తులసి, మిరియాలు, తేనె జత చేయడంవల్ల మరింత ప్రభావవంతంగా పనిచేస్తుంది. 

Advertisement
Advertisement