నజరానా నై!

ABN , First Publish Date - 2020-08-14T10:50:48+05:30 IST

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఏకగ్రీవ గ్రామపంచాయతీలకు నజరానా అందని ద్రాక్షగానే మారుతోంది.

నజరానా నై!

ఏకగ్రీవ పంచాయతీలకు అందని ప్రోత్సాహకం 

ఎన్నికలు జరిగి ఏడాదిన్నరైనా స్పష్టత ఇవ్వని ప్రభుత్వం 

సర్పంచ్‌లకు తప్పని ఎదురుచూపులు


ఆంధ్రజ్యోతి రంగారెడ్డి అర్బన్‌ / ఆంధ్రజ్యోతి, వికారాబాద్‌ : ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఏకగ్రీవ గ్రామపంచాయతీలకు నజరానా అందని ద్రాక్షగానే మారుతోంది. గ్రామ పంచాయతీ పాలక వర్గాలు ఎన్నికై ఏడాదిన్నర గడిచిపోయినప్పటికీ నేటికీ ప్రభుత్వం ప్రోత్సాహకం అందించడం లేదు. ఎన్నికలు లేకుండా పాలకవర్గాలను ఎన్నుకున్న గ్రామ పంచాయతీలకు ప్రత్యేక నజరానాను ఇస్తామని గ తంలో ప్రకటించినప్పటికీ ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వడం లేదు. గ్రామాభివృద్ధి కోసం తమ రాజకీయ భవిష్యత్‌ను పక్కనబెట్టి అధికార, ప్రతిపక్ష పార్టీలు తేడా లేకుండా ఏకగ్రీవం కోసం నాయకులు ముందుకు వచ్చారు. గ్రామంలో ఎన్నికలు లేకుండా ఏకగ్రీవం చేసినప్పటికీ నజరానాను అందించండంలో తీవ్ర జాప్యం చేస్తున్నారు.  ప్రోత్సాహకం కోసం ఏకగ్రీవ పంచాయతీలు ఎదురు చూస్తున్నాయి. 


ఏకగ్రీవ పంచాయతీలకు నజరానాలను ఇస్తామని ప్రభుత్వం చేసిన ప్రకటన మాటలకే పరిమితమైంది. పంచాయతీలకు ఎన్నికలు జరిగి ఏడాదిన్నర అవుతున్నా వాటి జాడే లేదు. నజరానాలు ఎప్పుడందుతాయని ఎదురుచూస్తున్న ఏకగ్రీవ సర్పంచ్‌లకు ఎదురుచూపులే మిగిలాయి. ఎన్నికలు లేకుండా పాలక వర్గాలను ఎన్నుకున్న గ్రామ పంచాయతీలకు ప్రత్యేక నజరానాను ఇస్తామని గతంలో ప్రకటించినప్పటికీ ఇప్పటి వరకు ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. గ్రామ అభివృద్ది కోసం తమ రాజకీయ భవవిష్యత్‌ను పక్కన పెట్టి అధికార, ప్రతిపక్ష పార్టీలు అనే తేడా లేకుండా ఏకగ్రీవం కోసం నాయకులు ముందుకు వచ్చారు. గ్రామంలో ఎన్నికలు లేకుండా ఏకగ్రీవం చేసినప్పటికీ నజరానాను అందించడంలో తాత్సారం చేస్తోంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మొత్తం 1,187 గ్రామ పంచాయతీలు ఉండగా అందులో 135 పంచాయతీల్లో పాలక వర్గాలను ఎన్నికలు లేకుండా ఏక్రగీవ్రంగా ఎన్నుకున్నారు.


దీంతో ఏకగ్రీవ గ్రామ పంచాయతీలు ప్రోత్సాహకం కోసం ఎదురుచూస్తున్నాయి. ఏకగ్రీవ పంచాయతీలకు ప్రభుత్వం రూ. 10 లక్షల చొప్పున ప్రోత్సాహకాన్ని అందిస్తామని ప్రకటించింది. ఎన్నికలు జరిగి ఏడాదిన్నర గడిచిపోయినప్పటికీ నజరానా మాత్రం విడుదల కావడం లేదు. అప్పటి నుంచి ఆయా పాలక వర్గాలకు ఎదురుచూపులు తప్పడం లేదు. ప్రభుత్వం అందించే నజరానాతో గ్రామాన్ని అభివృద్ది చేసుకోవాలని కన్న కలలు కలలుగానే మిగిలిపోతున్నాయి. ప్రొత్సాహకం కింద వచ్చే రూ. 10 లక్షలతో మౌళిక వసతులు, ఇతర అభివృద్ది పనులు చేపటొచ్చని భావించారు. కానీ.. ప్రోత్సాహకం అందకపోవడంతో అభివృద్ది ముందుకు సాగడం లేదు. గ్రామాల అభివృద్దికి కోసం ప్రత్యేకంగా పల్లె ప్రగతి కార్యక్రమాలను చేపడుతోంది. ప్రతీ నెలా 14వ ఆర్థిక సంఘం, ఎన్‌ఎ్‌ఫసీ నిధులను విడుదల చేస్తోంది. కానీ ఏక గ్రీవ పంచాయతీలకు అందించే ప్రోత్సాహకం మాత్రం విడుదల చేయకపోవడంతో ఆయా పాలక వర్గాలు నిరాశ చెందుతున్నాయి. ప్రభుత్వం ప్రోత్సాహకం అందిస్తే అభివృద్ది చేయడానికి అవకాశం ఉంటుందని అభిప్రాయపడుతున్నాయి.  


ఒక్క పైసా రాలే..జెట్ట కుమార్‌, సర్పంచ్‌, బండోనిగూడ, నందిగామ మండలం 

రాష్ట్ర ప్రభుత్వం ఏకగ్రీవ గ్రామపంచాయతీలకు నజరానా ప్రకటించి ఏడాదిన్నర గడిచిపోయినా.. నేటివరకు ఒక్క పైసా ఇవ్వలేదు. నజరానా వస్తే గ్రామాన్ని సంపూర్ణంగా అభివృద్ధి చేద్దామనుకున్నాం. ఎన్నో సమస్యలు ఉన్న గ్రామాలను ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. ఏకగ్రీవంగా ఎన్నికైన నన్ను ప్రజలు అభివృద్ధి చేయమని కోరుతున్నారు. ప్రభుత్వం మాత్రం ఇచ్చిన మాట తప్పడం బాధాకరం.


ఏడాదిన్నరగా ఎదురుచూస్తున్నా.. పెంట్యానాయక్‌, సత్యంతండా సర్పంచ్‌, మంచాల మండలం 

గ్రామస్థులమంతా మాట్లాడుకుని ఏక గ్రీవ గ్రామపంచాయతీగా ఏర్పాటు చేసు కున్నాం. పంచాయతీకి రూ.10 లక్షల నిధులు వస్తాయని అధికారులు చె ప్పారు. కానీ ఇప్పటివరకు చిల్లిగవ్వ కూడా రాలేవు. ప్రోత్సాహ నిధుల కోసం ఏడాదిన్నరగా ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నాం. అధికారులను అడిగితే.. ఇంకా మంజూరు కాలేవని చెబుతున్నారు. నిధులు వస్తే తండాలో భూగర్భడ్రైనేజీకి ప్రాధాన్యత ఇస్తాం.  

Updated Date - 2020-08-14T10:50:48+05:30 IST