నిప్పుల కుంపటి

ABN , First Publish Date - 2020-05-22T10:32:58+05:30 IST

వేసవిలో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తు న్నాడు. గురువారం ఇరుజిల్లాల్లో 44 డిగ్రీల ఉష్ణోగ్రత

నిప్పుల కుంపటి

44 డిగ్రీలకు చేరుకున్న ఉష్ణోగ్రతలు 

పెరిగిన వడగాలి తీవ్రత

నిర్మానుష్యంగా రహదారులు


ఖమ్మం/కొత్తగూడెం, మే 21 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): వేసవిలో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తు న్నాడు. గురువారం ఇరుజిల్లాల్లో 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదుకాగా వడగాల్పులు తీవ్రం అయ్యాయి. దీంతో జనం భయపడి బయటకు రావడంలేదు. రహదారులన్నీ నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి. మొన్నటి వరకు కరోనా భయంతో బయటకు రాని జనం.. ఇప్పుడు వడగాలుల దెబ్బకు ఎవరూ రావడంలేదు. జనం రాకపోవడంతో వ్యాపార సముదాయాలు వెలవెలబోతు న్నాయి. వృద్ధులు, చిన్నారులు ఎండవేడికి తట్టుకోలేక పోతున్నారు. ఎవైనా పనులు ఉంటే ఉదయాన్నే బయటకు వచ్చి 10గంటలలోగా పనులు పూర్తిచేసు కుంటున్నారు. ఖమ్మం నగరంతోపాటు జిల్లాలో ఇతర చోట్ల సైతం అధిక ఉష్ణోగ్రతలే నమోదవుతున్నాయి.


కొబ్బరిబొండాలు, శీతలపానీయాలకు గిరాకీ పెరిగింది. ఒకరోఇద్దరో బయటకు వస్తే శీతలపానియాలు తాగి ఉపశమనం పొందుతున్నారు. 25వ నుంచి రోహిణి కార్తె ప్రారంభం కానుంది. ఇప్పుడే ఎండలు ఇలా ఉంటే రోహిణి కార్తెలో ఎలా ఉంటాయోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సింగరేణి ఓపెన్‌ కాస్ట్‌ బొగ్గుబావుల వద్ద 45డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సింగరేణి కార్మికులు విధుల్లోకి వెళ్లాలంటే పలు ఇబ్బందులు తప్పడంలేదు. గురువారం నుంచి లే ఆఫ్‌ తొలగించడం తో బొగ్గు ఉత్పత్తి ప్రారంభమైంది. ఇల్లెందు మండలం కొమరారం గ్రామంలో ఎండ వేడిమి వల్ల హై వోల్టేజీ రావడంతో 29 టీవీలు, 71 ఫ్యాన్లు, 14 ఫ్రిజ్‌లు, 32 కూలర్లు దగ్ధమయ్యాయి. పినపాక మండలం సీతంపేటలో ఎండవేడిమి వల్ల కూడా రెండు గ్యాస్‌ సిలిండర్లు పేలడంతో అగ్ని ప్రమాదం జరిగి నాలుగు పూరిళ్లు దగ్ధమయ్యాయి. ఎండలను దృష్టిలో పెట్టుకొని జిల్లా యంత్రాంగం అప్రమత్తమై వెంటనే చలివేంద్రాలను ఏర్పాటు చేసి ప్రజలు వడదెబ్బలకు గురికాకుండా వైద్య సిబ్బందిని అప్రమత్తం చేసి ఫస్ట్‌ ఎయిడ్‌ చికిత్సలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

Updated Date - 2020-05-22T10:32:58+05:30 IST