గాబాలో భారత్ గర్జన.. ఆసీస్‌పై చారిత్రాత్మక విజయం

ABN , First Publish Date - 2021-01-19T18:39:54+05:30 IST

టీమిండియా చరిత్ర సృష్టించింది. గాబా టెస్టులో తిరుగులేని విజయాన్ని సాధించింది. ఈ పిచ్‌లో ఓటమంటే ఎరుగని కంగారూలకు గెలుపంటే ఇలా ఉంటుందని రుచి చూపించింది. వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్..

గాబాలో భారత్ గర్జన.. ఆసీస్‌పై చారిత్రాత్మక విజయం

బ్రిస్బేన్: టీమిండియా చరిత్ర సృష్టించింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరిగిన నాలుగో టెస్టులో భారత్ తిరుగులేని విజయాన్ని సాధించింది. గాబా పిచ్‌లో ఓటమంటే ఎరుగని కంగారూలకు గెలుపంటే ఎలా ఉంటుందో రుచి చూపించింది. వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్(89 నాటౌట్) ఆసీస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 328 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు శుభ్‌మన్ గిల్(91) అద్భుత ఆరంభాన్నిచ్చాడు. ఆ తరువాత చటేశ్వర్ పుజారా(56) అమోఘమైన డిఫెన్స్‌తో ఆసీస్ బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టాడు. ఒకానొక సమయంలో పుజారాను అవుట్ చేయలేని కంగారూ బౌలర్లు అతడి శరీరానికి సైతం బంతులు వేసి బాధించారు. అయినప్పటికీ పుజారా డిఫెన్స్‌ను ఛేదించడంలో విఫలమయ్యారు. ఇక మ్యాచ్ చివరి వరకు పంత్ క్రీజులో పాతుకుపోయి భారత్‌కు మరపురాని విజయాన్ని అందించాడు. దీంతో టీమిండియా 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. 


ఇదిలా ఉంటే గాబా పిచ్‌లో ఆసీస్ ఓటమంటే ఎరుగదు. దశాబ్దాలుగా ఆ పిచ్‌లో ఆసీస్‌ను ఓడించిన దేశం లేదు. ఈ విషయాన్నే మ్యాచ్ ముందు ఆసీస్‌కు చెందిన అనేకమంది మాజీలు కూడా వ్యాఖ్యానించారు. అయితే వారందరి ఆలోచనలనూ తలక్రిందులూ చేస్తూ భారత్ విజయఢంకా మోగించింది. గాబాలో విజయ గర్వంతో గర్జించింది.


ఫొటోల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి



Updated Date - 2021-01-19T18:39:54+05:30 IST