బ్రిస్బేన్ టెస్ట్: పట్టు బిగిస్తున్న టీమిండియా.. విజయం దక్కేనా..?

ABN , First Publish Date - 2021-01-19T16:01:05+05:30 IST

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా టీమిండియా-ఆసీస్ మధ్య జరుగుతున్న నాలుగో మ్యాచ్‌‌పై భారత్ పట్టు బిగిస్తోంది. గెలుపు దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే 3 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసిన భారత్ విజయానికి కేవలం 146 పరుగులు దూరంలో...

బ్రిస్బేన్ టెస్ట్: పట్టు బిగిస్తున్న టీమిండియా.. విజయం దక్కేనా..?

బ్రిస్బేన్: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా టీమిండియా-ఆసీస్ మధ్య జరుగుతున్న నాలుగో మ్యాచ్‌‌పై భారత్ పట్టు బిగిస్తోంది. గెలుపు దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే 3 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసిన భారత్ విజయానికి కేవలం 146 పరుగులు దూరంలో ఉంది. ఇంకా మ్యాచ్‌లో 37 పరుగులు మి తొలి సెషన్‌ నెమ్మదిగా సాగినా.. లంచ్ తరువాత భారత్ వేగం పెంచింది. 4 రన్ రేట్‌తో 100 పరుగులు రాబట్టింది. అయితే మూడో సెషన్‌లో కూడా ఇదే జోరుతో ఆడితే 37 ఓవర్లలో 146 పరుగులు సులభంగా సాధించగలుగుతుంది. అదే జరిగితే బ్రిస్బేన్‌లో భారత జట్టు చరిత్ర సృష్టించనట్లే అవుతుంది. దశాబ్దాల నుంచి ఈ పిచ్‌లో ఓటమనేదే లేకుండా దూసుకెళుతున్న ఆసీస్‌ను ఆఖరి పంచ్ ఇచ్చి ఇంటికి గర్వంగా వెనుదిరుగుతుంది.


ఇదిలా ఉంటే ఐదో రోజు ప్రారంభంలోనే ఓపెనర్ రోహిత్ శర్మ(7) వెంటనే అవుటైనా.. యువ బ్యాట్స్‌మెన్ శుభ్‌మన్ గిల్(91) అద్భుత బ్యాటింగ్‌తో అదరగొట్టాడు. కానీ త్రుటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. అతడితో పాటు పుజారా(43) కూడా క్రీజులో పాతుకుపోయాడు. ఆసీస్ బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తున్నాడు. అయితే గిల్ తరువాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ రహానే(24) మాత్రం నిరాశపరిచాడు. ప్రస్తుతం పుజారాతో పాటు రిషబ్ పంత్(10) క్రీజులో ఉన్నాడు.

Updated Date - 2021-01-19T16:01:05+05:30 IST