ఒలింపిక్స్‌ క్యాంపెయిన్‌కు సన్నాహాలు

ABN , First Publish Date - 2021-06-09T05:55:41+05:30 IST

టోక్యో ఒలింపిక్స్‌ సమీపిస్తుండడంతో దేశంలోనూ విశ్వక్రీడల జోష్‌ నింపేందుకు స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (సాయ్‌), భారత ఒలింపిక్‌ సంఘం (ఐఓ ఏ) ఐక్య కార్యచరణ...

ఒలింపిక్స్‌ క్యాంపెయిన్‌కు సన్నాహాలు

న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌ సమీపిస్తుండడంతో దేశంలోనూ విశ్వక్రీడల జోష్‌ నింపేందుకు స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (సాయ్‌), భారత ఒలింపిక్‌ సంఘం (ఐఓ ఏ) ఐక్య కార్యచరణ రూపొందించింది. వచ్చే నెల 23 నుంచి ప్రారంభమవనున్న ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న భారత క్రీడాకారులను ఉత్తేజపరచడంతో పాటు ప్రజలకు విశ్వక్రీడల గురించి తెలియజేసేందుకు సాయ్‌, ఐఓఏ కలిసి వివిధ కార్యక్రమాలకు రూపకల్పన చేశాయి. ఒలింపిక్స్‌ క్విజ్‌, వ్యాసరచన, డిబేట్‌ పోటీలు, ఉత్తమ నినాదం, డిజిటల్‌ పోస్టర్‌, ఒలింపిక్స్‌ సాంగ్‌ రూపకల్పన పోటీలు వంటివి దేశవ్యాప్తంగా నిర్వహించాలని రాష్ట్ర ఒలింపిక్‌ సంఘాలకు సూచించాయి. సోషల్‌ మీడియాలో కూడా ఒలింపిక్స్‌పై జోరుగా ప్రచారం చేయాలని.. దేశంలోని ప్రముఖ ప్రాంతాల్లో సెల్ఫీ పాయింట్లు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర సంఘాలను సాయ్‌, ఐఓఏ ఆదేశించాయి. 


Updated Date - 2021-06-09T05:55:41+05:30 IST