Advertisement
Advertisement
Abn logo
Advertisement

11 ఏళ్ల భారతీయ అమెరికన్ చిన్నారికి అరుదైన గుర్తింపు!

వాషింగ్టన్: ప్రపంచంలోనే అత్యంత తెలివైన విద్యార్థుల్లో ఒకరిగా 11 ఏళ్ల భారతీయ అమెకరిన్ చిన్నారి గుర్తింపు పొందింది. ప్రముఖ యూఎస్ యూనివర్శిటీ జాన్స్ హాప్కిన్స్.. నటాషా పెరి అనే భారత సంతతి విద్యార్థినికి ఈ గుర్తింపు ఇచ్చింది. న్యూజెర్సీలోని థెల్మా ఎల్. సాండ్మీర్ ఎలిమెంటరీ స్కూల్‌లో ఐదో తరగతి చదువుతున్న నటాషా ఇలా అరుదైన గుర్తింపును దక్కించుకోవడం విశేషం. జాన్స్ హాప్కిన్స్ సెంటర్ ఫర్ టాలెంటెడ్ యూత్ టాలెంట్(సీటీవై)లో భాగంగా నిర్వహించిన SAT, ACTలతో పాటు వీటికి సమానమైన పరీక్షల్లో అద్భుతమైన ప్రదర్శనతో నటాషా సత్తా చాటింది. దీంతో ఆమెకు ఈ అరుదైన గౌరవం దక్కినట్లు నిర్వాహకులు సోమవారం వెల్లడించారు. ఇక 2020-21 విద్యా సంవత్సరానికి గాను సీటీవై టాలెంట్ సెర్చ్ పరీక్షలో 84 దేశాల నుంచి సుమారు 19వేల మంది హాజరు కాగా, నటాషా 90 శాతానికి పైగా మార్కులు సాధించి నిర్వాహకులను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది. ఎంతో కఠినమైన సీటీవైలో భారతీయ చిన్నారి ప్రదర్శన ఎంతో అద్భుతమని పలువురు ప్రముఖులు ఆమెను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

Advertisement

తాజా వార్తలుమరిన్ని...

Advertisement