America లో దారుణం.. శవాలుగా కనిపించిన భారతీయ విద్యార్థులు.. కారులో వెళ్తుండగా..

ABN , First Publish Date - 2021-09-15T23:09:21+05:30 IST

అగ్రరాజ్యం అమెరికాను ‘ఐడా’ హరికేన్‌ గజగజ వణికించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా లూసియానా, న్యూయార్క్ సిటీ, న్యూజెర్సీ‌లో ఐడా బీభత్సం సృష్టించింది. వందల సంఖ్యలో ప్రాణాలు కోల్పోగా, వేలాది మంది నిరాశ్రయులయ్యారు. గల్లంతైన చాలామంది ఆచూకీ ఇంకా దొరకలేదు. ఇక న్యూజెర్సీలో ఇప్పటివరకు 29 మంది ఐడాకు బలి కాగా..

America లో దారుణం.. శవాలుగా కనిపించిన భారతీయ విద్యార్థులు.. కారులో వెళ్తుండగా..

పాసైక్, న్యూజెర్సీ: అగ్రరాజ్యం అమెరికాను ‘ఐడా’ హరికేన్‌ గజగజ వణికించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా లూసియానా, న్యూయార్క్ సిటీ, న్యూజెర్సీ‌లో ఐడా బీభత్సం సృష్టించింది. వందల సంఖ్యలో ప్రాణాలు కోల్పోగా, వేలాది మంది నిరాశ్రయులయ్యారు. గల్లంతైన చాలామంది ఆచూకీ ఇంకా దొరకలేదు. ఇక న్యూజెర్సీలో ఇప్పటివరకు 29 మంది ఐడాకు బలి కాగా, ఇటీవల న్యూజెర్సీలోని పాసైక్ ప్రాంతంలోని ఓ నదిలో ఇద్దరు ఎన్నారై విద్యార్థుల శవాలు ఒడ్డుకు కొట్టుకు వచ్చాయి. మృతులను నిధి రానా(18), ఆయూష్ రానా(21)గా అధికారులు గుర్తించారు. 


ఈ నెల 1న రాత్రి 9.30 గంటలకు(అమెరికా కాలమానం ప్రకారం) పాసైక్ ప్రాంతంలో వీరు ప్రయాణిస్తున్న కారు వరద నీటిలో కొట్టుకుపోయింది. ఆ తర్వాత వారి కారు నది పరివాహాక ప్రాంతంలో బయటపడింది. అప్పటి నుంచి పాసైక్ నది చుట్టుపక్కల నిధి, ఆయూష్ కోసం ముమ్మరంగా గాలించారు. ఈ క్రమంలో సెప్టెంబర్ 8న మొదట నిధి మృతదేహాం కీర్నీ ప్రాంతంలో నది ఒడ్డున దొరికింది.


ఇవీ చదవండి..

ఇకపై NRI లకు పిల్లలను దత్తత తీసుకోవడం చాలా సులువు.. 

ఆ వలసదారులు Kuwait కు ప్రమాదమే.. దేశం నుంచి బహిష్కరించండి.. ఓ MP డిమాండ్ 


ఆ తర్వాతి రోజు కీర్నీ సరిహద్దులోని నెవార్క్ జలాల్లో ఆయూష్ మృతదేహాం బయటపడింది. దీంతో సెప్టెంబర్ 10న ఈ ఇద్దరు విద్యార్థుల మృతిపై అక్కడి ప్రాంతీయ మెడికల్ ఆఫీస్ ప్రకటన చేసింది. నిధి, ఆయూష్ మృతితో వారి కుటుంబాలు విషాదంలో మునిగిపోయాయి. ఈ ఇద్దరితో పాటు మరో ముగ్గురు భారతీయులు ధనూష్ రెడ్డి, మాలతి కంచే, సునంద ఉపాధ్యే కూడా ఐడాకు బలైన విషయం తెలిసిందే. 


Updated Date - 2021-09-15T23:09:21+05:30 IST