Abn logo
Aug 13 2021 @ 18:10PM

కాంగోలో నిరసనకారుల హల్‌చల్.. భారతీయుల వ్యాపార సముదాయాలు ధ్వంసం

న్యూఢిల్లీ: కాంగోలో భారతీయుల వ్యాపార సముదాయాలపై కొందరు నిరసనకారలు దాడులు చేశారు. ఆర్థికంగా నష్టం పరిచారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. కాంగోకు చెందిన ఓ విద్యార్థి ఉన్నత చదువుల కోసం బెంగళూరు వచ్చి, అక్కడే నివసిస్తున్నాడు. అతనిపై వచ్చిన నేరారోపణల కారణంగా కొద్ది రోజుల క్రితం ఆ యువకుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో పోలీసుల కస్టడీలో ఉన్న ఆ విద్యార్థి.. గత వారం ప్రాణాలు కోల్పోయాడు. ఈ క్రమంలోనే కాంగోలో పుకార్లు వ్యాపించాయి. ఇండియాలో ఇద్దరు కాంగో విద్యార్థులు మరణించారంటూ ప్రచారం జరిగింది. దీంతో అక్కడి కొందరు కాంగో దేశ పౌరులు ఆగ్రహంతో ఊగిపోయారు. కాంగో రాజధానిలోని భారతీయుల వ్యాపార సముదాయాలపై గురువారం దాడులకు తెగబడ్డారు. దుకాణాల్లో ఉన్న సమాగ్రిని ఎత్తకుపోవడంతోపాటు షాప్‌లపై రాళ్లు విసిరారు. అంతటితో ఆగుకుండా వాహనాలకు నిప్పంటించారు. దీనిపై సమాచారం అందుకున్న కాంగో పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులను అదుపు చేశారు.  


తాజా వార్తలుమరిన్ని...