యూకేలో భార‌త సంత‌తి వ్య‌క్తికి ఏడేళ్ల జైలు !

ABN , First Publish Date - 2020-04-02T20:42:50+05:30 IST

అక్ర‌మంగా ఆయుధాలు క‌లిగి ఉన్న కేసులో యూకేలో భార‌త సంత‌తి వ్య‌క్తికి అక్క‌డి స్థానిక‌ కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది.

యూకేలో భార‌త సంత‌తి వ్య‌క్తికి ఏడేళ్ల జైలు !

లండ‌న్‌: అక్ర‌మంగా ఆయుధాలు క‌లిగి ఉన్న కేసులో యూకేలో భార‌త సంత‌తి వ్య‌క్తికి అక్క‌డి స్థానిక‌ కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. అక్ర‌మ ఆయుధాల కేసులో దోషిగా తేలిన హృతిక్ శ‌కారియా(19)కు హ‌ర్రౌవ్ క్రౌన్ కోర్టు మంగ‌ళ‌వారం ఈ శిక్ష‌ను ఖ‌రారు చేసింది. లండ‌న్‌లోని శ‌కారియా ఇంట్లో స్కాట్లాండ్ యార్డ్‌కు చెందిన‌ నార్త్ వెస్ట్ క‌మాండ్ యూనిట్ అక్ర‌మంగా దాచిపెట్టిన తుపాకుల‌ను గుర్తించింది. నార్త్ లండ‌న్‌లోని స్టాన్‌మోర్‌లో నివసించే శ‌కారియా అక్ర‌మంగా మార‌ణ ఆయుధాల‌ను క‌లిగి ఉన్నాడనే స‌మాచారంతో అత‌ని ఇంట్లో త‌నిఖీలు చేసిన అధికారుల‌కు భారీ మొత్తంలో తుపాకులు దొరికాయి. దీంతో శ‌కారియాను అదుపులోకి తీసుకుని అతనిపై అక్ర‌మంగా ఆయుధాల‌ను క‌లిగి ఉండ‌డం కింద కేసు న‌మోదు చేశారు. అనంత‌రం అతడిని హ‌ర్రౌవ్ క్రౌన్ కోర్టులో హాజ‌రుప‌రిచారు. న్యాయ‌స్థానంలో శ‌కారియా త‌న నేరాన్ని అంగీక‌రించాడు. దీంతో అత‌డికి ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది.

Updated Date - 2020-04-02T20:42:50+05:30 IST