ఆక్స్‌ఫర్డ్ స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్‌గా భారతీయ యువతి ఎన్నిక
ABN , First Publish Date - 2021-05-21T18:19:05+05:30 IST
ప్రముఖ ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ ఉప ఎన్నికలో మేగ్డాలేన్ కాలేజీలో హ్యూమన్ సైన్స్ చదువుతున్న భారత సంతతి యువతి అన్వీ భుతానీ విజయం సాధించారు. 2021-22 విద్యా సంవత్సరానికి గాను జరిగిన స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ బైపోల్ ఫలితాన్ని గురువారం అర్థరాత్రి ప్రకటించారు. ఈ ఎన్నికలో మొత్తం..
లండన్: ప్రముఖ ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ ఉప ఎన్నికలో మేగ్డాలేన్ కాలేజీలో హ్యూమన్ సైన్స్ చదువుతున్న భారత సంతతి యువతి అన్వీ భుతానీ విజయం సాధించారు. 2021-22 విద్యా సంవత్సరానికి గాను జరిగిన స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ బైపోల్ ఫలితాన్ని గురువారం అర్థరాత్రి ప్రకటించారు. ఈ ఎన్నికలో మొత్తం 11 మంది అభ్యర్థులు బరిలోకి దిగగా.. యూనివర్శిటీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా 2,506 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాగా, ఈ ఉప ఎన్నికలో అన్వీ భారీ మెజారిటీతో గెలిచినట్లు తెలుస్తోంది. ఇదిలాఉంటే.. మొదట ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్‌గా భారత్‌కు చెందిన రష్మీ సమంత్ గెలిచారు. అయితే, సోషల్ మీడియా వేదికగా ఆమె చేసిన కొన్ని పాత పోస్టులు ఆమెను ఈ పదవి నుంచి తప్పుకునేలా చేశాయి. దాంతో స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ కోసం ఉప ఎన్నిక తప్పలేదు. ఈ బైపోల్‌లో మళ్లీ భారతీయ విద్యార్థినినే గెలుపొందడం విశేషం.