USలో మేయర్‌గా భారత సంతతి అమెరికన్

ABN , First Publish Date - 2022-01-28T22:50:05+05:30 IST

భారత సంతతికి చెందిన వ్యక్తి.. అగ్రరాజ్యం అమెరికాలోని ఓ సిటీ మేయర్‌గా బాధ్యతలు స్వీకరించారు. దీంతో ఆ పదవిని చేపట్టిన తొలి ఆసియన్ అమెరికన్ ఆయన గుర్తింపు పొందారు. ఇందుకు సంబంధించిన పూ

USలో మేయర్‌గా భారత సంతతి అమెరికన్

ఎన్నారై డెస్క్: భారత సంతతికి చెందిన వ్యక్తి.. అగ్రరాజ్యం అమెరికాలోని ఓ సిటీ మేయర్‌గా బాధ్యతలు స్వీకరించారు. దీంతో ఆ పదవిని చేపట్టిన తొలి ఆసియన్ అమెరికన్ ఆయన గుర్తింపు పొందారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


ఓహియో రాష్ట్రంలోని సిన్సినాటి నగర మేయర్ ఎన్నికలు కొద్ది రోజుల క్రితం జరిగాయి. ఈ ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ తరఫున పోటీకి దిగి, భారత సంతతికి చెందిన అఫ్టాబ్ కర్మ సింగ్ పురేవల్(39) విజయం సాధించారు. సిన్సినాటి నగర మేయర్‌గా ఎన్నికయ్యారు. ఈ క్రమంలోనే తాజాగా ఆయన సిన్సినాటి నగర మేయర్‌గా ప్రమాణస్వీకారం చేశారు. దీంతో ఈ పదవిని చేపట్టిన తొలి ఆసియన్ అమెరికన్‌గా అఫ్టాబ్ కర్మ సింగ్ పురేవల్ గుర్తింపు పొందారు. ఈ కార్యక్రమానికి స్థానికంగా ఉన్న ఇండియన్ అమెరికన్లతోపాటు టిబెటియన్ దేశస్తులు కూడా హాజరయ్యారు. ఇదిలా ఉంటే.. అఫ్టాబ్ కర్మ సింగ్ పురేవల్ తండ్రి ఇండియన్ కాగా.. ఆయన తల్లి టిబెటియన్. ఈయన ఓహియోలో జన్మించి అక్కడే పెరిగారు.  




Updated Date - 2022-01-28T22:50:05+05:30 IST