అరుదైన వ్యాధి బారినపడ్డ భారత చిన్నారి.. సాయం కోసం ఎదురుచూస్తోంది!

ABN , First Publish Date - 2021-04-09T01:20:29+05:30 IST

భారత సంతతికి చెందిన 12ఏళ్ల అమ్మాయి అత్యంత అరుదైన వ్యాధితో బాధపడుతోంది. ఈ క్రమంలో ఆమె తల్లిదండ్రులు విరాళాల సేకరణ ప్రారంభించారు. దాతలు ముందుకు వచ్చి తమకు సహాయం

అరుదైన వ్యాధి బారినపడ్డ భారత చిన్నారి.. సాయం కోసం ఎదురుచూస్తోంది!

సిడ్నీ: భారత సంతతికి చెందిన 12ఏళ్ల అమ్మాయి అత్యంత అరుదైన వ్యాధితో బాధపడుతోంది. ఈ క్రమంలో ఆమె తల్లిదండ్రులు విరాళాల సేకరణ ప్రారంభించారు. దాతలు ముందుకు వచ్చి తమకు సహాయం చేయాల్సిందిగా వేడుకుంటున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఇండియాకు చెందిన నీరజ్ సాహ్నీ, వందన దంపతులు కొన్నేళ్లుగా ఆస్ట్రేలియాలో నివసిస్తూ అక్కడే స్థిరపడ్డారు. ఈ క్రమంలో 12ఏళ్ల క్రితం వాళ్లు.. పాప(త్రిష)కు జన్మనిచ్చారు. తర్వాత త్రిషను ఆమె తల్లిదండ్రులు కిండర్‌గార్డెన్ స్కూల్‌లో జాయిన్ చేశారు. అయితే ఇక్కడే త్రిషకు సంబంధించిన ఓ విషయాన్ని తెలుసుకుని నీరజ్, వందన దంపతులు షాక్‌కు గురయ్యారు. ఇతరులతో పోల్చితే.. తమ బిడ్డలో ఎదుగుదల నెమ్మదిగా జరుగుతున్నట్టు తెలుసుకున్నారు. తన పేరు రాయడానికి, నర్సరీ రైమ్స్‌ను తిరిగి అప్పజెప్పడానికి కూడా ఇబ్బంది పడుతున్నట్టు గ్రహించారు. 


ఈ క్రమంలో త్రిషకు ఐదేళ్ల వయసు వచ్చిన తర్వాత.. తమ బిడ్డ అస్పార్టైల్‌గ్లూకోసమినూరియా అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్టు డాక్టర్ల ద్వారా తెలుసుకున్నారు. ఇదే సమయంలో ఆ వ్యాధికి చికిత్స లేదనే విషయాన్ని విని.. శోకసంద్రంలో మునిగిపోయారు. అయితే తాజాగా ఓ వార్త వారిలో కొత్త ఆశలను రేకెత్తించాయి. అస్పార్టిల్‌గ్లూకోసమినూరియా వ్యాధిపై అమెరికాలో పరిశోధనలు జరుగుతున్నట్టు వారికి తెలిసింది. అయితే తమ బిడ్డకు అమెరికాలో చికిత్స చేయించేందుకు సుమారు 2మిలియన్ డాలర్ల వరకు ఖర్చవుతుందని.. దాతలు ముందుకొచ్చి తమ కూతురును ఆదువాల్సిందిగా వేడుకుంటున్నారు. గోఫండ్‌మీ అనే ఫండ్ రైజింగ్ వెబ్‌సైట్ ద్వారా విరాళాలు అందించాలని కోరుతున్నారు. 


ఇదిలా ఉంటే.. ప్రపంచ వ్యాప్తంగా 120 మంది మాత్రమే ఈ వ్యాధితో బాధపడుతన్నారని డాక్టర్లు చెబుతున్నారు. అంతేకాకుండా ఆస్ట్రేలియా మొత్తంలో అస్పార్టైల్‌గ్లూకోసమినూరియాతో బాధపడుతున్నది త్రిషానే కావడం విశేషం.


Updated Date - 2021-04-09T01:20:29+05:30 IST